సినిమా వచ్చేవరకు సినిమా హిట్ అవుతుందా..? ఫ్లాప్ అవుతుందా అనేది ఎవరు ఊహించలేము. కొన్ని కొన్ని సార్లు భారీ బడ్జెట్ తో సినిమాలను తెర మీదకి తీసుకువస్తూ ఉంటారు. కానీ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయిపోతుంది. డిజాస్టర్ గా మిగిలిపోతూ ఉంటుంది. సీనియర్ హీరోలకి కూడా అప్పుడప్పుడు ప్లాప్ లు తప్పవు ఏ సినిమా హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కారణాల వలన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసిన నటులు కూడా ఉన్నారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాలకి తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారు. తన సినిమా బోల్తా కొట్టింది అంటే నిర్మాతల్ని ఆదుకోవడంలో కృష్ణ ముందుండే వారు. అందుకే కృష్ణని నిర్మాతల హీరో అని పిలిచేవారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది నిర్మాతలకి బాగా లాస్ వచ్చింది. అందుకని పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేశారు. రజినీకాంత్ కూడా ఒకసారి ఇదే చేశారు. బాబా మూవీ రిలీజ్ అయ్యాక డిస్టిబ్యూటర్స్ బాగా లాస్ అయ్యారని రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ నటించిన జానీ, కొమరం పులి సినిమాలు డిజాస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చేసారు. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రిజల్ట్ చూసి పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేశారు.
Also read:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అవడంతో పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేశారు సమంత శాకుంతల సినిమా డిజాస్టర్ అవ్వడం తో ఆమె రెమ్యూనరేషన్ ఇచ్చేసింది. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చింది కానీ బాగా లాస్ అయింది. అప్పుడు పారితోషకాన్ని వెనక్కి ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ.
రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పారితోషకాన్ని రవితేజ ఇచ్చేసాడు. సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా నరసింహుడు సినిమా ఫ్లాప్ అవడంతో రెమ్యూనరేషన్ ఇచ్చేశారు.