ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి అందరికీ పరిచయమే. కేంద్రం లో నిధులు నిర్వహించిన అమ్రపాలి తిరిగి తెలంగాణకి రావడం జరిగింది. ఈ క్రమం లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకి కీలక బాధ్యతల్ని అప్పగించింది కూడా. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా ఆమెని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈమె ప్రేమించిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. పైగా అవన్నీ వైరల్ అవుతున్నాయి.
ఐఏఎస్ అమ్రపాలి చాలా ధైర్యవంతురాలు. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని కూడా తెచ్చుకున్నారు. డైనమిక్ ఆఫీసర్గా ఆమ్రపాలి వరంగల్ అర్బన్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అధికారినిగా ప్రశంసలు అందుకుంటున్నారు. పైగా సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా వుంటున్నారు. యూత్ లో సైతం ఫాలోయింగ్ ఉంది. తాజాగా కేంద్రంలో విధులు నిర్వహించిన ఆమ్రపాలి తిరిగి తెలంగాణకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా పెట్టారు ఇది విని అభిమానులు అందరూ కూడా ఆనందిస్తున్నారు.
Also read:
అమ్రపాలి సొంత గ్రామం ప్రకాశం జిల్లా. ఒంగోలు శివారులో ఎన్ అగ్రహారం. ఈమె తండ్రి పేరు కాటా వెంకటరెడ్డి. తల్లి పేరు పద్మావతి. ఈమె విశాఖలో పుట్టారు. ఐఐటి మద్రాస్ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశారు. తర్వాత బెంగళూరు లోని ఐయామ్ నుండి పిజి డిప్లమో ని పూర్తి చేశారు. 2011 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మని ఈమె ప్రేమించారు. సమీర్ శర్మ ఢిల్లీకి చెందిన వ్యక్తి 2011లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు. ఇద్దరు మనసులు కలిసిన తర్వాత పెద్దలను ఒప్పించి 2018 లో పెళ్లి చేసుకున్నారు. జమ్మూ లో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.