కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాటల దాడి ఆపడం లేదు. అలాగే బీఆర్ఎస్ గత పాలనపై ప్రస్తుత ప్రభుత్వం విరుచుకుపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న సమస్యల దరఖాస్తులను చూస్తుంటే తెలుస్తుందని అన్నారు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు పాలనను దగ్గర చేస్తున్నామన్నారు. ఈమేరకు జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు.. ప్రజావాణిలో వచ్చే వినతి పత్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) వెల్లడించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక సీఎం, మంత్రులు, జిల్లా కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.
కరెంట్ బిల్లులు కట్టోద్దు అంటు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖ ను పూర్తిగా అప్పుల్లో ముంచి నీతులు చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ విచారణకు జరుగుతుందని తెలిపారు.
తన రాజకీయ లబ్ది కోసం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వివాదం కేసీఆర్ తెరపై తీసుకువచ్చారని మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్ట్ ల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు.. SLBC సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఎస్టీమేషన్ భారీగా పెరిగింది.. SLBC ను 5 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకొన్న బీఆర్ఎస్ నేతలు ఊచలు లెక్కబెట్టడం ఖాయమని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.