Telugu News » KCR : కేసీఆర్ పొలిటికల్ యాక్టివ్ పై నేతల్లో నెలకొన్న ఆందోళన.. రేవంత్ సర్కార్ తో చిక్కులు తప్పవా..?

KCR : కేసీఆర్ పొలిటికల్ యాక్టివ్ పై నేతల్లో నెలకొన్న ఆందోళన.. రేవంత్ సర్కార్ తో చిక్కులు తప్పవా..?

మరోవైపు కేసీఆర్ తీరు రాజకీయాల్లో పలు చర్చలకు తావిస్తోంది. ఇక ఆయన పొలిటికల్ గా ఇనేక్టివ్ అయినట్లేనా అనే టాక్ రాష్ట్రంలో మొదలైంది. కేటీఆర్ అయితే సింహం వస్తుందని ఆశలు పెంచారు..

by Venu
cm-kcr-mass-counter-to-revanth-reddy

తెలంగాణ (Telangana) స్క్రీన్ పై బీఆర్ఎస్ సినిమా ఇక ఆడదా ?.. ముఖ్యమంత్రి సీటుపై ఒక్కరోజు అయిన కూర్చోవాలనే కేటీఆర్ కోరిక ఇక కంచికేనా ?.. ప్రస్తుత రాజకీయ నాటకంలో పాత్రధారులుగా మిగిలిపోయిన బీఆర్ఎస్ (BRS) పరిస్థితి రోజు రోజుకు అయోమయంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. వాడిపోతున్న గులాబీకి కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) వాటర్ పోసి బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు..

కానీ యజమాని కేసీఆర్ (KCR) మాత్రం రాష్ట్ర మొదటి సీఎం గా చక్రం తిప్పి.. కాంగ్రెస్ (Congress) నేతలకు నిదుర లేని రాత్రులు చూపించి.. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఒక మూల కూర్చోవడం అంటే.. ఆయన మనస్సు ఒప్పుకోవడం లేదనే ప్రచారం మొదలైంది. అందుకే వరుసగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారని, అసలు రేవంత్ రెడ్డి ముందు కూర్చోవాలంటే.. అపార రాజకీయ చాణక్యుడు అనే బిరుదుకు మచ్చ వస్తోందని భావిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.

మరోవైపు కేసీఆర్ తీరు రాజకీయాల్లో పలు చర్చలకు తావిస్తోంది. ఇక ఆయన పొలిటికల్ గా ఇనేక్టివ్ అయినట్లేనా అనే టాక్ రాష్ట్రంలో మొదలైంది. కేటీఆర్ అయితే సింహం వస్తుందని ఆశలు పెంచారు.. కానీ ఆ సింహం గాండ్రించడం మానేసి.. కనీసం బడ్జెట్ రోజున కూడా అసెంబ్లీకి హాజరు కాలేదేంటబ్బా..? అని అంతా అనుకుంటున్నారు. ఇక ఎలాంటి సందేహాలకూ తావులేకుండా అసలు నిజం రుజువైపోయిందని భావిస్తున్నారు.

ఇక బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ, శాసన మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం సభలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. కనీసం ఆ రోజునైనా కేసీఆర్ సభకు హాజరౌతారా అన్న విషయంపై స్పష్టత లేదు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఇంత వరకూ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. కనీసం మీడియా ముఖంగానైనా ఓటమిని అంగీకరించి, కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపింది లేదు. రాత్రికి రాత్రి ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లడంతో ఓటమిని జీర్ణించుకోలేక ఆయన ముఖం చాటేశారన్న విమర్శలకు అవకాశం ఇచ్చింది.

మరోవైపు కేసీఆర్ ఇదే ఒరవడి కొనసాగిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ భారీగా నష్టపోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా తెచ్చుకొన్న పేరు ఇప్పుడు శాశ్వతంగా నిలిచిపోతుందా ?.. అని భావిస్తున్నారు. ఇలాగైతే బీఆర్ఎస్ ను నమ్ముకుని ఉన్న నేతల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలైయ్యాయి.. ఇంత కాలం బాస్ ను నమ్ముకొని భాషా లా ఎగిరారు.. మరి రేవంత్ సర్కార్ ఊరుకొంటుందా ?.. అనే అనుమానాలు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు సవాల్ గా మారాయంటున్నారు..

You may also like

Leave a Comment