Telugu News » Hyderabad : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తాం.. హెచ్చరిస్తున్న ఆటోడ్రైవర్లు..!

Hyderabad : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తాం.. హెచ్చరిస్తున్న ఆటోడ్రైవర్లు..!

ఉప్పల్‌ (Uppal) మల్లాపూర్‌లో ఆటోబంద్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.

by Venu

మహిళల కోసం కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్న వారు ఆనందంగానే ఉన్నారు.. కానీ ఆటోడ్రైవర్లు (Auto Drivers) మాత్రం తమకు గిరాకి లేక రోడ్డునపడ్డామని ఆందోళనకు దిగడం తెలిసిందే.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆటోడ్రైవర్లు మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు.

ఉప్పల్‌ (Uppal) మల్లాపూర్‌లో ఆటోబంద్‌ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తామని వెల్లడించారు.

అంటే కాకుండా అభ్యర్థుల ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆటోలకు స్టిక్కర్లు అంటించి ఆటోడ్రైవర్లు అందరూ బంద్‌లో పాల్గొనాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు 16వ తేదీన ఉదయం 10 గంటలకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని తెలిపారు.

ఈ క్రమంలో ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంలో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసిన యూనియన్‌ అధ్యక్షుడు.. ప్రభుత్వం తమ సమస్యలకు ఇంతవరకు పరిష్కారం చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment