Telugu News » TSRTC New Plan : ప్రయాణీకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకొన్న తెలంగాణ ఆర్టీసీ.. అమల్లో నయా ప్లాన్..!

TSRTC New Plan : ప్రయాణీకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకొన్న తెలంగాణ ఆర్టీసీ.. అమల్లో నయా ప్లాన్..!

మరోవైపు 44 సీట్లు ఉండే సిటీ బస్సుల్లో 63 మంది ప్రయాణిస్తే, ఆర్టీసీ 100% ఆక్యుపెన్సీని పరిగణిస్తుంది. కానీ ప్రస్తుతం మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు, కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడానికి ఇబ్బందిగా మారింది.

by Venu
TSRTC Good News For Male Passengers

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) మహిళలకు వరంగా మారగా.. సిబ్బందికి మాత్రం చుక్కలు చూపిస్తోంది.. ఇక కండక్టర్ల పరిస్థితి గురించి నిత్యం వార్తల్లో వస్తున్న ఘటనలు బాధాకరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. ప్రయాణికులతో చీవాట్లు.. టిక్కెట్ తీసుకోవాలంటే ఒలంపిక్ పోటీల్లో పాల్గొన్నంత ఫీలింగ్.. ఇవి అధిక రద్దీ కారణంగా జరుగుతున్న సిత్రాలు.. అయితే ఈ అంశాలపై దృష్టి సారించిన టీఎస్ ఆర్టీసీ (TSRTC) కొత్త ప్రయోగానికి తెరతీసింది.

ఇందులో భాగంగా ముందుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ (Hyderabad) జోన్‌ పరిధిలోని బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి, మెట్రో రైలులో మాదిరిగానే ఇరువైపులా సీటింగ్‌ ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ స్థలం ఉండడంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో సీట్లు మార్చి రంగంలోకి దించారు. ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్‌లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే పద్దతిని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు 44 సీట్లు ఉండే సిటీ బస్సుల్లో 63 మంది ప్రయాణిస్తే, ఆర్టీసీ 100% ఆక్యుపెన్సీని పరిగణిస్తుంది. కానీ ప్రస్తుతం మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు, కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడానికి ఇబ్బందిగా మారింది. టిక్కెట్ల ప్రక్రియలో ఎవరికీ జీరో టికెట్ ఇవ్వకున్నా.. అధికారులు కండక్టర్ పై చర్యలు తీసుకొంటున్నారు. ఈ క్రమంలో సమస్యలన్నింటికీ పరిష్కారంగా సీటింగ్ సిస్టమ్ మార్చడమే మంచిదని భావించిన ఆర్టీసీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగిందని. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారని అధికార్లు తెలిపారు. ఇక నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. ఉదయం పూట ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లే వారితో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అందుకే ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకొందని పేర్కొంటున్నారు.

You may also like

Leave a Comment