రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. పుస్తకాలలోని లెక్కలన్నీ ఒక ఫార్ములా ప్రకారం ఉంటాయి.. కానీ రాజకీయ లెక్కలకు అసలు ఫార్ములానే లేదని విశ్లేషకులు అంటుంటారు. ఎందుకంటే.. పొలిటికల్ (Political) ల్లో అన్ని ఎక్కువే.. అధికారం.. అహంకారం.. పలుకుబడి.. డబ్బు.. ఇవి శాశ్వతం కాదని నాయకులకు తెలుసు.. కానీ పదవులకున్న పవర్ వల్ల మనిషిని ఆడిస్తాయని గుర్తించే వారు అరుదుగా కనిపిస్తారు..
అదేవిధంగా కలిసివచ్చిన అధికారం ఉందని అహంకారంతో విర్రవీగితే.. ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు. చరిత్రను గమనిస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి.. మితిమీరిన విశ్వాసంతో, అహంకారం వల్ల నష్టపోయి పతమైన పార్టీలు.. కొన్ని సమయాల్లో ఉనికిలో లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఏర్పడిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైందని అంటున్నారు..
తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత బీఆర్ఎస్ (BRS)కు వచ్చిన డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.. పార్టీ టిక్కెట్ల కోసం అయితే నేతలు తీవ్రంగా శ్రమించిన సంఘటనలున్నాయి. కేసీఆర్ (KCR) బరిలోకి ఎవర్ని దించిన ఓటర్లు పట్టించుకునేవారు కాదు. కేవలం కారు గుర్తునే చూసేవారు. అంతెందుకు జహీరాబాద్ లో బీబీ పాటిల్ అనే ఎంపీకి తెలుగు కూడా రాదు. అయినా రెండు సార్లు కారు గుర్తుకు ఉన్న క్రేజ్ వల్లే గెలిచారు.
బలంగా అంతటి పునాదులు ఏర్పరచుకొన్న బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతోంది. లోక్ సభ అభ్యర్థుల కోసం వెదుక్కుంటోందని, పోటీ చేయమని నేతల్ని బతిమాలుతోందని వార్తలు వస్తున్నాయి. అయినా ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉందంటే.. మహబూబ్ నగర్ (Mahbub Nagar) ఎంపీ అభ్యర్థే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.
మాటలు రాని వారికి సైతం గులాబి బాస్ ఎంపీ టికెట్టు ఇవ్వడం ఆ పార్టీ పరిస్థితిని తెలియచేస్తుందని అంటున్నారు.. ఇక సిట్టింగ్ ఎంపీలు హ్యాండ్ ఇవ్వడంతో కొత్త వారు ఎరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో చేవెళ్ల నుంచి ఖమ్మం వరకూ అదిలాబాద్ నుంచి నల్లగొండ వరకూ.. అభ్యర్థుల వేట.. ఎడారిలో వజ్రాల కోసం వెతికినట్లు ఉందంటున్నారు. అయినా దిక్కులేక చివరికి బీఎస్పీతో పొత్తు పెట్టుకొవడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. నమ్మి అధికారం అప్పచెబితే.. బీఆర్ఎస్ నేతలంతా హద్దులు దాటడం.. రాష్ట్రానికి కింగ్‌లు అని భావించి.. మాకు తప్ప ఎవరికీ ఓటేసే దిక్కు లేదనుకొని చెలరేగిపోతే.. ఇంటికి పంపించేస్తారనే విషయాన్ని మరచారని.. చరిత్రను పరిశీలిస్తే అలాంటి తిరస్కరణకు గురైన పార్టీలు చాలా ఉన్నాయని అంటున్నారు..