లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో బీజేపీ (BJP) నేతలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. ఇందులో భాగంగా విపక్షాలపై ప్రధాని మాటలతో విరుచుకు పడుతున్నారు.. సమాజ్వాదీ పార్టీ కి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్, అజాంగఢ్ లో పర్యటిస్తున్న మోడీ.. రూ. 34 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు..

దేశంలో కుటుంబ రాజకీయాలు చేసే వారు రోజురోజుకి మోడీని ద్వేషిస్తున్నారని, మోడీకి సొంత కుటుంబం అంటూ లేదని విమర్శించడం తెలుస్తోందని అన్నారు.. కానీ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబమే అని తెలిపారు. వారంతా ‘మోడీకా పరివార్’ అన్న విషయాన్ని మరచిపోతున్నారని పేర్కొన్నారు.. ఆజంగఢ్పై ప్రేమ-అభివృద్ధి చూపించడం కొందరికి నచ్చడం లేదని అన్నారు..
కులతత్వం, వంశ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఇండియా కూటమికి అసలే నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా పూర్వంచల్ ప్రాంతం దశాబ్ధాలుగా కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలను చూస్తోందని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) నాయకత్వంలో గత 7 ఏళ్లలో అభివృద్ధి చెందిందని మోడీ వెల్లడించారు.. మరోవైపు నేడు రూ.34,000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.