రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్, ఆధారాల ధ్వంసం కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Praneet Rao)కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నిన్న రాత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను పంజాగుట్ట (Panjagutta) పోలీసులు చంచల్‌గూడ (Chanchalguda) జైలుకు తరలించారు.
కాగా ప్రణీత్ గతంలో ఎస్ఐబీ (SIB)లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకులతో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులు, సెలబ్రిటీలకు చెందిన ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు డీఎస్పీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా ఎస్ఐబీ కార్యాలయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, ఆధారాల ధ్వంసం కేసును విచారించటానికి జూబ్లిహిల్స్ (Jubilee Hills) ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన దర్యాప్తు బృందంను ప్రభుత్వం నియమించింది.
ఈ క్రమంలో ఇప్పటికే ప్రణీత్‌రావును దర్యాప్తు బృందం విచారించింది. అయితే ఈ బృందం మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించటానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న హస్తం ఎవరిది. ప్రణీత్‌ను ఎవరు ప్రోత్సహించారు? ఫోన్ ట్యాపింగ్ సాంకేతిక పరికరాలను ఇతను ఏ విధంగా సమకూర్చుకొన్నాడు? ఈ విషయంలో సహకరించిన వారు ఎంత మంది ఉన్నారు.. ఎంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతుంది. అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు..
అంతేగాక, ఎన్నికల సమయంలో కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్లలో డబ్బులను తరలిస్తున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని పసిగట్టి, సంబంధిత అధికారులకు సమాచారాన్నిచ్చి పట్టుకోవటంలో ప్రణీత్‌రావు చురుకుగా వ్యవహరించాడని అధికారుల దృష్టికి వచ్చింది. ఈమేరకు ప్రణీత్ రావు నుంచి ఇప్పటికే సెల్ఫోన్లను సీజ్ చేశారు. పదిలక్షల కాల్ డేటాను తొలగించినట్లు గుర్తించారు.
సెల్ఫోన్లను మరింత సమాచారం కోసం FSLకు పంపించారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగా మరికొందరి పెద్దల పాత్ర బయటపడే అవకాశముందని సమాచారం.. కాగా ప్రణీత్‌రావు అరెస్ట్‌తో పలువురు మాజీ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.. ప్రణీత్‌రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.