బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అస్వస్థతకు గురయ్యారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబై(Mumbai)లోని కోకిలాబెన్ ఆస్పత్రి(Kokilaben Hospital)లో శుక్రవారం ఉదయం ఆయన చేరినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల అమితాబ్‌కు ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి.
దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే అలాంటి వార్తలపై బిగ్ బీ స్పందించారు. తాను అనారోగ్యంతో ఉన్నానని వచ్చిన వార్తలను ఖండించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆయన థానేకు వచ్చారు.
థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మారీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు బిగ్‌బీ తన కుమారుడితో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన అమితాబ్‌ను తన ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించింది.
దానికి ఆయన స్పందిస్తూ అందులో ఎలాంటి నిజం లేదన్నారు. అన్నీ ఫేక్ అని స్పష్టం చేశారు. అసలు విషయం తెలుసుకున్న బిగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్ త్వరలో ప్రభాస్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, కోలీవుడ్‌లో రజనీకాంత్, వెట్టయన్ చిత్రంలో కూడా ఆయన నటించనున్నట్లు టాక్.