బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి.. ఆ పార్టీ నేతలు పక్క పార్టీల మీద ఖర్చిఫ్ వేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే చాలా మంది నేతలు వలసలు వెళ్లారు.. ఈ క్రమంలో ఖైరతాబాద్ (Khairatabad) బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే దానం నాగేందర్ ( MLA Danam Nagender) కాంగ్రెస్ (Congress)లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే అధికారికంగా ఈ మ్యాటర్ కన్ఫామ్ కాలేదు.. ఈ విషయంపై ప్రస్తుతం దానం స్పందించారు. తనపై వస్తున్న వదంతులు, జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నానని తనపై ప్రచారం జరుగుతోందని.. కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం ప్రస్తుతం లేదని తెలిపారు. ఇవన్నీ వార్తలు మాత్రమే నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.
అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ లో కొనసాగుతానని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద మొత్తంలో హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో దానం కూడా పార్టీ మారుతున్నట్లు వార్తలు పుట్టాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆయన భేటీ అవడం.. ఈ పుకార్లు నిజమని నమ్మారు.
నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైందనే వార్తలు ప్రచారంలోకి తెచ్చారు. ఈనెల 18న ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వ్యాపించాయి.. గ్రేటర్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో దానం నాగేందర్‌ను చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని అనుకున్నారు. అనూహ్యంగా దానం స్పందించి బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించడంతో పుకార్లకు పులిస్టాప్ పడినట్లయింది.