Telugu News » Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు తొమ్మిదో సారి ఈడీ సమన్లు..!

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు తొమ్మిదో సారి ఈడీ సమన్లు..!

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని సూచించింది.

by Mano
Arvind Kejriwal: ED summons Kejriwal for the ninth time..!

ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Policy Case)లో మనీలాండరింగ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) మరోసారి నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని సూచించింది.

Arvind Kejriwal: ED summons Kejriwal for the ninth time..!

ఆయనకు ఈడీ సమన్లు జారీచేయడం ఇది తొమ్మిదోసారి. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు నోటీసులు అందజేసింది. అయితే ఆయన ప్రతీసారి విచారణకు గైర్హజరవుతూ వస్తున్నారు. ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు పంపినప్పటికీ, ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు హాజరుకావడంలో విఫలమయ్యారని వాదిస్తూ ఈడీ ఫెడరల్ ఏజెన్సీ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేసింది. గతంలో కోర్టు ఆదేశాల మేరకు మార్చి 16వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కవిత అరెస్టుతో స్వయంగా హాజరవ్వాలని కేజ్రీవాల్‌ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్‌ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీచేయడం గమనార్హం.

You may also like

Leave a Comment