Telugu News » TS AP Rains: నగర వాసులకు ఊరట.. అన్నదాతకు నష్టం..!

TS AP Rains: నగర వాసులకు ఊరట.. అన్నదాతకు నష్టం..!

ఉష్ణోగ్రత(Temperature)తో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు ఉపశమనం కలుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఈ వాతావరణం మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) హెచ్చరించింది.

by Mano
TS AP Rains: Relief for the city dwellers.. loss for the breadwinner..!

వేసవి(Summer) కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండలతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పలుచోట్ల కురిసిన వర్షం(Rain) ఊరటనిచ్చింది. ఉష్ణోగ్రత (Temperature)తో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు ఉపశమనం కలుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఈ వాతావరణం మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) హెచ్చరించింది.

TS AP Rains: Relief for the city dwellers.. loss for the breadwinner..!

 

హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. చింతల్, ఐడీపీఎల్, షాపూర్ నగర్, గ్డిమెట్ల, సూరారం, పటాన్ చెరు, రామచంద్రాపురం, బీహెచ్ ఈఎల్‌లో తేలికపాటి వర్షం కురిసింది. కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. మరోవైపు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు మండలాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి.

విర్నపల్లిలో వరి కోత దశలో ఉన్న పంట పొలాలపై ఆకాల వడగళ్ల వర్షానికివరి పంటలు నేల రాలాయి. సంగారెడ్డి జిల్లాలో ఆకాలవర్షానికి వరి, మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు మామిడి నేలరాలింది. మరో నెల రోజుల్లో మామిడి పంట చేతికివచ్చే సమయంలో వడగళ్ల వాన నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TS AP Rains: Relief for the city dwellers.. loss for the breadwinner..!

అటు ఏపీలో వాతావరణం చల్లబడింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రా వరకు ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం(మార్చి 20) పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

You may also like

Leave a Comment