ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌రావు (Praneeth Rao) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ (Telangana) హైకోర్టు (High Court) నేడు విచారణ జరిపింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా హైకోర్టులో న్యాయవాది గండ్ర మోహన్ రావు.. ప్రణీత్ రావు తరపు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ ను ఆక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు..

ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్అప్ చేయించాలని తెలిపిన న్యాయవాది.. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెబుతున్నారని పేర్కొన్నారు.. అలాగే పోలీస్ స్టేషన్లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని గండ్ర మోహన్‌రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావు ను 24 గంటలు పోలీస్ కస్టడీలోకి అనుమతి ఇచ్చిందన్నారు.
పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని కోర్టులో వెల్లడించారు.. అదేవిధంగా ప్రణీత్ రావు అరెస్ట్ జరిగిన రోజు మాత్రమే డీసీపీ ప్రెస్‌నోట్ ఇచ్చారని వివరించారు. ఈ కేసు విషయంలో మీడియాకు పోలీస్ అధికారులు లీకులు ఇస్తారని చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు.. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు..
అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యిందని.. కానీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదని తెలిపారు.. మరోవైపు ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
			         
			         
														