Telugu News » Hyderabad : హోల్ సేల్ మెడికల్ షాప్ లపై రెయిడ్స్.. సంచలన విషయాలు గుర్తించిన డీసీఏ అధికారులు..!

Hyderabad : హోల్ సేల్ మెడికల్ షాప్ లపై రెయిడ్స్.. సంచలన విషయాలు గుర్తించిన డీసీఏ అధికారులు..!

రిటైల్ మార్కెట్ ధరలకంటే తగ్గింపు ధరలతో ఈ ఔషధాల విక్రయాలు జరగడంపై పక్కా సమాచారం అందడంతో సోదాలు జరిపినట్లు తెలిపారు. ఈ ఔషధాలు అసలైనవా కాదో నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

by Venu

నగరంలోని హోల్ సేల్ మెడికల్ షాప్ లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపారు.. ఈ తనిఖీల్లో భాగంగా మధుమే‍హ‍ రోగులు వినియోగించే ఇన్సులిన్‌ను అడ్డదారిలో సేకరించి భారీ డిస్కౌంట్లకు విక్రయిస్తున్నట్లు తెలంగణ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని పలు హోల్‌సేల్ (Whole Sale) వ్యాపారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు కనిపెట్టారు..

హోల్ సెల్ మెడికల్ షాపులపై రెయిడ్స్ చేసిన అధికారులు.. కేసు నమోదు చేసి సుమారు రూ. 51 లక్షల విలువైన ఇంజక్షన్స్ స్టాక్ సీజ్ చేసినట్లు తెలిపారు. వాటిలో సికింద్రాబాద్ (Secunderabad)లో దుర్గా హబ్ మెడికల్ షాప్ లో 6.7 లక్షల స్టాక్.. ఉప్పల్ శ్రీ తిరుమల ఫార్మా మెడికల్ షాప్ లో 3.52 లక్షల స్టాక్.. సుల్తాన్ బజార్ లో శ్రీ పరస్ మెడికల్ ఏజెన్సీస్ లో 9 లక్షల స్టాక్.. నాగోల్ శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ లో 14 లక్షల స్టాక్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు..

అదేవిధంగా కాప్రా (Kapra)లోని శ్రీ రాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ లో 2 .7 లక్షల స్టాక్.. కాచిగూడ శ్రీ బాలాజీ ఏజెన్సీస్ లో 16 లక్షల స్టాక్ సీజ్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు వివరించారు.. కాగా ఈ ఇన్సలిన్‌ను ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా న్యూఢిల్లీ నుంచి అక్రమంగా సేకరించారని తెలిపారు.. DCA దాడుల్లో భారీ మొత్తంలో ఇన్సులిన్ (Insulin) ఇంజెక్షన్లతో పాటు ప్రీ-ఫిల్డ్ పెన్నుల్ని గుర్తించారు. వీటిని హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన పలువురు టోకు వ్యాపారులు 40% కంటే తగ్గింపుతో విక్రయిస్తున్నారన్నారు.

రిటైల్ మార్కెట్ ధరలకంటే తగ్గింపు ధరలతో ఈ ఔషధాల విక్రయాలు జరగడంపై పక్కా సమాచారం అందడంతో సోదాలు జరిపినట్లు తెలిపారు. ఈ ఔషధాలు అసలైనవా కాదో నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇన్సులిన్ తయారీ, నాణ్యత, ప్రామాణికతపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిస్కౌంట్లకు ఆశపడి నకిలీ ఔషధాలను కొనుగోలు చేయొద్దని, మందుల ప్రామాణికత నిర్ధారించుకోవాలని, ఈ విషయంలో వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment