Telugu News » 1Lac coin : రూ.లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం.. నెట్టింట వైరల్?

1Lac coin : రూ.లక్ష కాయిన్ విడుదల చేసిన కేంద్రం.. నెట్టింట వైరల్?

సోషల్ మీడియా పుణ్యమా (Social media) అని ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏం జరిగినా మనకు ఇట్టే తెలిసిపోతుంది. అందులో కొన్ని వాస్తవాలు ఉంటే మరికొన్ని అవాస్తవాలు ఉంటాయి. ఈ మధ్య కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

by Sai
The center that released the Rs. lakh coin.. Is it going viral?

ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రభుత్వం(Indian Government) రూ.1లక్ష కాయిన్ (1lac coin) విడుదల చేసినట్లు ఫొటోలు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి. ఇప్పటివరకు సాధారణంగా మనం రూ.1, రూ.5, రూ.10, రూ.100 కాయిన్స్ చూసి ఉంటాం. కానీ, రూ.1లక్ష కాయిన్ తొలిసారి చూసి ఉంటారు.

అచ్చం భారత ప్రభుత్వం విడుదల చేసినట్లు గానే ఉన్న ఈ కాయిన్ వాస్తవమా? ఫేక్? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాయిన్ గురించి భారత ప్రభుత్వం తరఫున ఎటువంటి సమాచారం లేదు.

అయితే, ఆర్బీఐ ఇప్పటివరకు రూ.100లోపు డినామినేషన్ కలిగిన నాణేలను మాత్రమే ముద్రించినట్లు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రూ.1లక్ష కాయిన్ అనేది నిజం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరో కావాలని రూ.1లక్ష కాయిన్ డిజైన్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాగా, దీనిపై భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సత్వరమే స్పందించాలని మరికొందరు కోరుతున్నారు.

You may also like

Leave a Comment