Telugu News » Telangana : యూట్యూబ్ చానెళ్లకు వార్నింగ్.. శిక్షకు సిద్ధంగా ఉండమని హెచ్చరించిన కేటీఆర్..!

Telangana : యూట్యూబ్ చానెళ్లకు వార్నింగ్.. శిక్షకు సిద్ధంగా ఉండమని హెచ్చరించిన కేటీఆర్..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీపై, నేతలపై అసత్యప్రచారాలు ప్రసారం చేస్తూన్నాయని మండిపడ్డారు.. ఈ క్రమంలో ప్రజలను తప్పుదోవ పట్టించే యూట్యూబ్ చానెళ్లపై కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

by Venu
KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) సొసైటీలో స్ట్రాంగ్ వేపన్ లా మారిందన్న విషయం తెలిసిందే.. ఒక మంచి జరగాలన్న.. లేదా ఒక చెడుకు కారణం కావాలన్న ఈ సోషల్ మీడియా అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని పలుమార్లు నిరూపించబడింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి చెందటంలో ఈ సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందనే అభిప్రాయాన్ని ఎన్నో సార్లు కేటీఆర్ వ్యక్తం చేశారు..

Ktr fire on bjp and Congressఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీపై, నేతలపై అసత్యప్రచారాలు ప్రసారం చేస్తూన్నాయని మండిపడ్డారు.. ఈ క్రమంలో ప్రజలను తప్పుదోవ పట్టించే యూట్యూబ్ చానెళ్లపై కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు (YouTube channels) స్వలాభం కోసం.. కొందరికి వత్తాసు పలుకుతూ.. చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.. ఈ వ్యవహారం అంతా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా జరుగుతున్నదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలు కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా పేర్కొన్నారు..

గతంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని వెల్లడించారు.. యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు..

అడ్డమైన తంబునెల్స్ తో, అసత్యాలను వార్తల పేరిట అదే పనిగా ప్రచారం చేస్తున్న ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోని, ప్రజలను తప్పుతోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. కుట్రపూరితంగా మమ్మల్ని దెబ్బతీయాలని వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు..

You may also like

Leave a Comment