ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan)లో తాలిబాన్లు (Taliban) అధికారంలోకి వచ్చాక ఇక్కడి పరిస్థితులు దిగజారుతున్నాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తాలిబాన్ల పాలనలో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని తెలుపుతున్నాయి.. వంటిళ్లకే మహిళలు పరిమితమయ్యారు. చివరకు బాలికల విద్యను సైతం తాలిబాన్లు నిషేధించారు. చివరకు అంతర్జాతీయ మిషన్లలో కూడా పనిచేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు..
మరోవైపు ఒక మహిళ ఒంటరిగా బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు.. ఇంట్లో పురుషుడి తోడు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ సమాజం ఈ వివక్ష పట్ల ఎంత ఆందోళన వ్యక్తం చేసిన ఇక్కడి ప్రభుత్వం మాత్రం లెక్కచేయడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తాలిబాన్లు మరో కఠిన శిక్షను అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది చాలా కఠినమైన చర్యగా తెలుస్తోంది..
ఈ దేశంలో వ్యభిచారానికి పాల్పడే మహిళల్ని బహిరంగంగా రాళ్లతో కొట్టి శిక్షించే శిక్షను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాలిబాన్ సుప్రీం లీడర్ (Supreme Leader) ముల్లాహిబతుల్లా అఖుంద్జాదా ఈ శిక్షను పున:ప్రారంభించినట్లు ప్రకటించారు. కాగా మహిళలను రాళ్లతో కొట్టి చంపడం మహిళల హక్కులను ఉల్లంఘించడమని మీరు అంటున్నారు. అయితే వ్యభిచారానికి సంబంధించి శిక్షను త్వరలో అమలు చేస్తామని తెలిపారు.
మహిళల్ని బహిరంగంగా కొరడాలతో, రాళ్లతో కొట్టి చంపుతామని గత శనివారం ఆ దేశ టీవీలో ప్రసారం చేయబడిన సందేశంలో ప్రకటించినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వాన్ని 2021లో తాలిబాన్లు దించేసి అధికారంలో వచ్చారు. అప్పటి నుంచి మహిళలకు తీవ్ర సవాళ్ళు ఎదురవుతున్నాయి.. కాగా యూఎన్ (UN) ఒక నివేదికలో ప్రపంచంలో ఆఫ్ఘన్ మహిళ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. బాలిక ఆత్మహత్య రేటు గత రెండేళ్లలో పెరగడం ఇక్కడి దారుణ పరిస్థితులకు సాక్ష్యంగా ఉందని అంటున్నారు..