Telugu News » Anantapur : టీడీపీలో చిచ్చు పెట్టిన చివరి లిస్ట్‌.. ఆఫీసుపై దాడి..!

Anantapur : టీడీపీలో చిచ్చు పెట్టిన చివరి లిస్ట్‌.. ఆఫీసుపై దాడి..!

ఆందోళన నేపథ్యంలో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు సీటు దక్కకపోవడంతో ప్రభాకర్ ఫ్యామిలీ కంటతడి పెట్టుకొంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నామని.. కానీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

by Venu
TDP: Final list of TDP candidates released..!

టీడీపీ అధినేత నేడు పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే అనంతపురం (Ananthapuram) అర్బన్ అసెంబ్లీ స్థానానికి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు, పాంప్లెట్లు తగలబెట్టారు. ఆనంతను అట్టుడికి పోయేలా చేశారు..

TDP: Third list of TDP candidates released..!అదీగాక నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టి.. ఫర్నీచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు. పార్టీని నమ్ముకొని కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకుండా, వాటిని డబ్బులు అమ్ముకున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలియచేసారు.. వచ్చే ఎన్నికల్లో ప్రసాద్‌కు సహకరించమని హెచ్చరించారు. ప్రభాకర్ కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళన నేపథ్యంలో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు సీటు దక్కకపోవడంతో ప్రభాకర్ ఫ్యామిలీ కంటతడి పెట్టుకొంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నామని.. కానీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ అమ్ముడుపోయిందని.. డబ్బున్న వారికి మాత్రమే విలువ ఇస్తుందని మండిపడ్డారు..

పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదని ఆరోపించారు.. మరోవైపు ప్రభాకర్ చౌదరి (Prabhakar Chowdary)కి టికెట్ ఇవ్వకపోవడంతో అర్బన్ తెలుగు మహిళలు.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.. టీడీపీ (TDP) జెండాలు, చంద్రబాబు (Chandrababu) ఫోటోలు ఫ్లెక్సీలకు నిప్పుబెట్టారు. మొత్తానికి ఏపీలో సైతం రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయని తెలుస్తోంది..

You may also like

Leave a Comment