కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలస నేతలు భారీగా క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.. దీనివల్ల మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్న వారి నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి.. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం అందుకొని.. బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేసి.. బీజేపీ (BJP)ని ధీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ ఆశలు పెట్టుకొంది. ఇప్పటికే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఎంపీ అభ్యర్థులను బరిలో నిలుపుతోంది.
ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఢిల్లీ (Delhi) వెళ్ళవలసి ఉంది. తెలంగాణలో ఇంకా నాలుగు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు జరుగుతుందని ముందుగా ప్రకటించడంతో సీఎం ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. కానీ ఢిల్లీలో ఈ రోజు విపక్ష పార్టీలు సేవ్ డెమొక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్నారు..
ఇందులో భాగంగా రాంలీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తుండటంతో సీఈసీ సమావేశం రేపటికి వాయిదా పడింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను రేపటికి వాయిదా వేసుకొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడిన కారణంగా తెలంగాణ (Telangana)లో పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పై సస్పెన్స్ నెలకొంది..