బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జైలుకి పొయినోల్లే సీఎంలు అవుతున్నారని తెలిపిన ఆయన తనపై ఎలాంటి కేసులు లేవని.. అలాగే అక్రమ ఆస్తులు కూడా లేవని పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు పై మీడియా అనవసర ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్యనే పోటీ ఉంటుందని.. కాంగ్రెస్ అంతలా పోటీనివ్వదని పేర్కొన్నారు.. ఇక ఈ ఎనికల్లో బీఆర్ఎస్ నాలుగు స్థానాలు మాత్రమే గెలుస్తోందని జోస్యం చెప్పారు.. ఖమ్మం, సికింద్రాబాద్ , మెదక్, మల్కాజ్ గిరి నియోజక వర్గాలలో గులాబీ జెండా ఎగురుతుందని తెలిపారు.. ఇక కాంగ్రెస్ (Congress)ది మొదటి నుంచి పార్టీ ఫిరాయింపుల సంస్కృతి అని మాగంటి గోపీనాథ్ ఆరోపించారు..
దానం నాగేందర్ పార్టీ మారడానికి ఉన్న కారణం.. ఆయనపై ఉన్న చిల్లర కేసులని తెలిపిన మాగంటి గోపీనాథ్.. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కూడా పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారాని ఆరోపించారు.. ఇక రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయని తెలిపిన ఎమ్మెల్యే.. ఆయన జైల్లో ఉన్న సమయంలో నేనే ప్రతిరోజు మూలాకత్ వ్యవహారాలు చూసుకునేవాడినని అన్నారు.. జైలు నుంచి బయటకు వచ్చిన టైంలో పెద్ద ర్యాలీ కూడా నిర్వహించినట్లు గుర్తు చేశారు..
దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత నన్ను, ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్ ని కూడా పార్టీలోకి తీసుకువస్తానని కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చినట్లు తెలిసిందన్నారు.. అయితే గతంలో మేము పార్టీ మారిన మాట వాస్తవమే కానీ వంద రోజుల్లోనే మాత్రం ఎప్పుడు మారలేదని అన్నారు.. అదేవిధంగా చంద్రబాబు తెంగాణ టీడీపీ వదులుతున్నారని తెలిసి అప్పుడు మాత్రమే పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారని మాగంటి జోస్యం చెప్పారు..