ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)కేసు దర్యాప్తులో అధికారులు స్పీడ్ పెంచారు. నిన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ ముగియడంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. నేడు రాధా కిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించింది. ఆయనను ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో రేపటి నుంచి పంజాగుట్ట (Panjagutta) పోలీసులు.. ఏడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు.
కాగా ప్రస్తుతం చంచల్ గూడా (Chanchal Guda) జైల్ లో ఉన్న రాధా కిషన్ రావును రేపు ఉదయం దర్యాప్తు బృందం కస్టడీకి తీసుకోనున్నారు.. తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం బంజారాహిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్ లో విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కూడా బలైనట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ ఆరోపించారు.
ఎమ్మెల్యేలు కొనుగోలు అంశంలో నా ఫోన్ ట్యాపింగ్ అయిందని పేర్కొన్న నంద కుమార్.. రాధా కిషన్ రావు ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు చేశారు.. నా ఫోన్ ట్యాప్ చేసిన అనంతరం మూడు వాయిస్ లు మీడియాకు వదిలారని తెలిపారు. అలాగే మోయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అప్పటి ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపించారు.. ఈమేరకు అక్రమ కేసులు పెట్టి రాధాకృష్ణ నన్ను వేధించారన్నారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ మీద డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు నంద కుమార్ వెల్లడించారు. నా ఫోన్ ని ఎమ్మెల్యేల ఫోన్ లని ట్యాపింగ్ చేయమని ఆదేశాలిచ్చింది ఎవరు..? అనేది బయటకు రావాలని కోరారు.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టాలీవుడ్ ను సైతం తాకింది.. దీనివల్లనే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి నాగచైతన్యకి పంపించింది ఎవరనేది ఉత్కంఠంగా మారింది. అలాగే ఈ పాపంలో రాధా కిషన్ రావు టీం హస్తం ఉందా అనే అనుమానాలు మొదలైయ్యాయి..