Telugu News » Hyderabad : అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణకు ఊరట.. మంజూరైన బెయిల్..!

Hyderabad : అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణకు ఊరట.. మంజూరైన బెయిల్..!

జనవరి 25న శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది.

by Venu
ACB raids: Whale of corruption.. Former director of HMDA Balakrishna arrested..!

అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ (Shiva Balakrishna)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో అరెస్టు అయిన శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివ నవీన్ కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. నాంపల్లి (Nampally) ఏసీబీ కోర్టు లక్ష రూపాయల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది.

telangana acb finds 214 acres land of hmda former director shiva balakrishnaమరోవైపు జనవరి 25న శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. లక్ష రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా హెచ్‌‌ఎమ్‌‌డీఏ (HMDA) టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది..

అదేవిధంగా గత పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారం రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణతో పాటు ఆయన బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, ఏడు ఇండ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారులు విచారణలో తెలుసుకొన్నారు. అతని పేరిట మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉండగా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రస్తుతం శివ బాలకృష్ణ నివాసముంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌ (Hyderabad)లో 4 అలాగే రంగారెడ్డి జిల్లాలో 3 బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చంచల్​గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. గతంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్​ను కొట్టివేసింది. తాజాగా ఆయన నిరీక్షణ ఫలించి బెయిల్ లభించింది.

You may also like

Leave a Comment