ప్రముఖ నటుడు సాయాజీ షిండే(Sayaji Shinde) అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయన విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన మహారాష్ట్రంలోని సతారాలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. సాయాజీ షిండేకు కొన్ని రోజుల కిందట కిందట ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేరి సాధారణ పరీక్షలు చేయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఈసీజీ(ECG) టెస్ట్ చేయగా ఆయనకు 2డీ ఎకోకార్డియోగ్రఫీని పూర్తి చేసినప్పుడు, గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత మరోసారి గురువారం ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతనికి కొన్ని పరీక్షలు చేశారు. కాగా, ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ చేసినట్లు వైద్యులు చెప్పారు.
అయితే ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్వరలోనే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఎన్నో ఆద్భుతమైన చిత్రాల్లో విలన్‌గా, తండ్రిగా, సహాయ నటుడి పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సాయాజీ షిండే. మహారాష్ట్ర చెందిన ఆయన మరాఠీతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషాల్లో నటించి మంచి ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు ఈయన మరాఠీలో నాటకాలు వేసేవారు. అక్కడనుంచి వెండితెరపై అడుగు పెట్టి దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. కొంతకాలంగా సాయాజీ తెలుగు సిని పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఏ సినిమాల్లోనూ కనిపించటం లేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.