Telugu News » MP Laxman: ‘ప్రభుత్వం పడిపోతే బాధ్యులం మేంకాదు.. కాంగ్రెస్‌లోనే గూడు పుఠానీ’..!!

MP Laxman: ‘ప్రభుత్వం పడిపోతే బాధ్యులం మేంకాదు.. కాంగ్రెస్‌లోనే గూడు పుఠానీ’..!!

బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్(K.Laxman) కాంగ్రెస్ సర్కార్‌(Congress Government) పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లోనే గూడు పుఠానీ నడుస్తోందని, ప్రభుత్వం పడిపోతే బాధ్యులం తాము కాదని అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తామంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.

by Mano
MP Laxman: 'We will not be responsible if the government falls.

బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్(K.Laxman) కాంగ్రెస్ సర్కార్‌(Congress Government) పై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)లో అభద్రతా భావం కనిపిస్తోందన్నారు.

MP Laxman: 'We will not be responsible if the government falls.

కాంగ్రెస్‌లోనే గూడు పుఠానీ నడుస్తోందని, ప్రభుత్వం పడిపోతే బాధ్యులం తాము కాదని అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తామంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు తడబడుతున్నాయని విమర్శించారు. ఇదివరకు వందరోజుల మా పాలనను రెఫరెండంగా భావించి మాకు ఓటు వేయాలని అన్నారని, ఇప్పుడేమో ఆరు గ్యారెంటీలపై వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తోందని దుయ్యబట్టారు.

తమ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత ఓవైసీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారని అన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనందున ఒవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు. ఇది స్వయంగా ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాటల్లోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఫిరోజ్ ఖాన్‌లురేవంత్ రెడ్డి తరుపున తాను మాట్లాడుతుంటే పార్టీలోని ఇతర నాయకులను నచ్చడంలేదని, అయినా రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్నారు.

సొంతపార్టీలోనే రేవంత్‌కు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కరువు వల్ల రైతులు నష్టపోతున్నారని, పంటకు బోనస్, రెండు లక్షల రుణ మాఫీ, కవులు రైతులను ఆదుకుంటామనీ చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో 14 స్థానాలు కైవసం చేసుకోబోతున్నామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.

అహంకారానికి, అబద్దాలకు నిదర్శనంగా ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. లోపాయికారంగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణలో మోడీ ప్రభంజనాన్ని తట్టుకోలేరని, బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి రెఫరoడాన్ని తాను స్వీకరిస్తున్నానన్నారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ ప్రధాని అవుతారని తన సవాల్‌ను రేవంత్‌ స్వీకరిస్తాడా? అని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment