నీళ్లు ఎక్కువగా తాగడం (Water) మంచిదని కొన్ని సర్వేలు, శరీరానికి సరిపడినంతే తాగాలని మరికొన్ని సర్వేలు (surveys) చెప్తుంటాయి. కానీ నీరు తగినంత తాగడం మంచిందనే ఎక్కువ మంది వైద్య నిపుణులు చెప్తుంటారు. కానీ స్వీట్లు (Sweets) తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని కొందరు, తాగవచ్చని మరి కొందరు మనకు సూచిస్తుంటారు. ఇందులో ఏది వాస్తవం అనేది ఇప్పుడు చూద్దాం.
ఇటీవల జరిగిన ఒక పరిశోధన ప్రకారం…మనం స్వీట్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని తేలింది.
స్వీట్లు, ఇతర తీపి పదార్థాలు తిన్న 35 మంది వ్యక్తుల నుంచి రక్తంలో చక్కెర స్థాయిలు పరీక్షించారు. వీరు తినే ముందు లేదా తర్వాత నీరు అస్సలు తాగలేదు. కానీ ఆ పరిశోధనలో భాగంగా తిన్న వెంటనే కొందరు, అరగంట తర్వాత మరి కొందరు నీళ్లు తాగారు. వీళ్ల రక్తంలోని షుగర్ ను పరిశీలిస్తే…స్వీట్ తిన్న వెంటనే నీళ్లు తాగిన వారిలో గ్లూకోజ్ స్థాయిలు ఇతరులకన్నా రెండింతలు పెరిగాయని తేలింది.
ఇలా జరగడానికి కారణం గ్లూకోజ్. స్వీట్లలో ఉండే వలన మనకు వెంటనే దాహం వేస్తుంది. అయితే ఈ సమయంలో నీరు తాగితే దాహం తీరదు. కానీ శరీరంలో మొత్తం గ్లూకోజ్ వినియోగం అయ్యే వరకు మనకు దాహం వేస్తూనే ఉంటుంది.
అందుకే మన శరీరానికి అవసమైన నీటిని ఎప్పటీకప్పుడూ తీసుకుంటూనే ఉండాలని, కానీ స్వీట్లు తిన్న వెంటనే కాకుండా, అరగంట సమయం తర్వాత నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రక్రియ బాగా జరగడంతో పాటు షుగర్ స్థాయిలు కూడా పెరగకుండా ఉంటాయని వైద్యులు అంటున్నారు.