Telugu News » Sruthihaasanబోరింగ్‌ ప్రశ్నలు అడగకండి: శ్రుతి హాసన్‌!

Sruthihaasanబోరింగ్‌ ప్రశ్నలు అడగకండి: శ్రుతి హాసన్‌!

ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద కాకుండా ఒంటినిండా టాటూలు వేయించుకునేదాన్ని.

by Sai
shruti-haasan-chit-chat-with-fans-in-instagram-interesting-questions-and-answers-about-love-and-marriage

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బ్యూటీ శ్రుతి హాసన్ (Sruthi Haasan)​. టాలీవుడ్​, కోలీవుడ్​, బాలీవుడ్​లో అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో ఓ స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. 2023 స్టార్టింగ్​లోనే రెండు హిట్​ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్​ స్టార్ హీరోలు బాలయ్య సరసన వీరసింహారెడ్డిలో, చిరంజీవికి జోడీగా వాల్తేరు వీరయ్యలో సందడి చేసింది.

shruti-haasan-chit-chat-with-fans-in-instagram-interesting-questions-and-answers-about-love-and-marriage

త్వరలోనే ప్రభాస్​ హీరోగా నటిస్తున్న సలార్​లో కనిపించనుంది. సెప్టెంబర్‌ 28న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడించనున్నట్లు తెలిపింది. అలాగే నేచురల్​ స్టార్​ నాని హీరోగా తెరకెక్కుతున్న హాయ్‌ నాన్నలోనూ శ్రుతి హాసన్‌ నటిస్తోంది. సోషల్​మీడియాలో ఎప్పుడూ సందడి చేసే శ్రుతి.. తాజాగా ఇన్​స్టాలో చిట్​చాట్​ చేసింది. తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చింది.

త్వరలోనే సలార్​ చిత్రంతో సందడి చేయనున్న స్టార్​ హీరోయిన్​ శ్రుతి హాసన్​.. తాజాగా ఇన్​స్టాలో తన అభిమానులతో ముచ్చటించింది. తన ఫ్యాన్స్​ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పింది. ఆ సరదా ముచ్చట్లు మీకు కూడా..టాటూలంటే ఇష్టమా?.. ‘పిచ్చి. 19 ఏళ్ల వయసులో తొలిసారి టాటూ వేయించుకున్నా. ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద కాకుండా ఒంటినిండా టాటూలు వేయించుకునేదాన్ని.

‘నటి కాకుంటే ఏ ఉద్యోగం చేసేవారు?.. ‘సేల్స్‌ గర్ల్‌. నాకు చిన్నప్పుడు సేల్స్‌ గర్ల్‌ అవ్వాలని కోరిక. అందుకే ఏ దుస్తుల దుకాణానికి వెళ్లినా అక్కడ కస్టమర్లతో చాలా సేపు ముచ్చట పెట్టేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఆ ఆలోచన మారిపోయింది’మీరెప్పుడైనా ఏడ్చారా?.. ‘చాలా సార్లు ఏడ్చా. నాది చాలా సున్నిత మనస్తత్వం. అందుకే చిన్న విషయాలకు కూడా ఏడుస్తా. కాకపోతే అందరిలో ఏడవడం ఇష్టం ఉండదు’శంతనుతో ప్రేమ ఎలా మొదలైంది?.. ‘తన ఆర్ట్‌ వర్క్‌ నచ్చి మొదట ఇన్‌స్టాలో ఫాలో అయ్యాను.

అలా మొదలైన నా పరిచయం ప్రేమ వరకూ వచ్చింది. ఇన్‌స్టాలోనే మా ప్రేమ పుట్టింది’పెళ్లెప్పుడు చేసుకుంటారు?.. ‘బోరింగ్‌ ప్రశ్నలు అడగొద్దు’మీరు వాడిన మొదటి ఫోన్‌.. మీకు ఇష్టమైన ప్రాంతం ఏది?.. ‘నోకియా ఫోన్‌ వాడాను. నాకు లండన్ అంటే చాలా ఇష్టం’ మని ఆయన పేర్కొన్నారు.

You may also like

Leave a Comment