Telugu News » ChatGPT : చాట్ జీపీటీ సూపర్ అప్ డేట్ చెప్పింది!

ChatGPT : చాట్ జీపీటీ సూపర్ అప్ డేట్ చెప్పింది!

చాట్ జీపీటీలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న కీలక అప్ డేట్ ని ఓపెన్ ఐ సంస్థ ప్రకటించింది

by Prasanna
ChatGPT

టెక్నాలజీ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపే నడుస్తోంది. ఏదైనా సమచారం కోసం చాట్ జీపీటీ (ChatGPT) యూజర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 2021 సెప్టెంబర్ వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే చాట్ జీపీటీ ఇవ్వగలిగేది. దీంతో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ (Real Time Info) దొరకపోవడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ తాజాగా ఇచ్చిన అప్ డేట్ తో ఆ సమస్యకు చెక్ పడినట్లే.

ChatGPT

చాట్ జీపీటీ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చాట్ జీపీటీలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న కీలక అప్ డేట్ ని ఓపెన్ ఐ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 2021 సెప్టెంబర్ వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలుగుతున్న చాట్ జీపీటీ…ఇకపై రియల్ టైమ్ సమాచారాన్ని అందించే విధంగా కీలక అప్ డేట్ ను తీసుకొచ్చింది.

అయితే ఈ అప్ డేట్ అందరికి అందుబాటులోకి రాలేదని చెప్పింది. ప్రస్తుతానికి చాట్ జీపీటీ ప్లస్, చాట్ జీపీటీ ఎంటర్ ప్రైజెస్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పింది. కానీ త్వరలోనే ఇది ప్రతి ఒక్కరికి అంటే అందరికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఐ సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం చాటిజీపీటీలో ఏదైనా సమాచారం అడిగితే.. 2021 సెప్టెంబర్ వరకు ఉన్న సమాచారాన్నే అందిస్తూ వస్తోంది. ఉదాహరణకు 2022లో ఏదైనా జరిగితే దానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని చెప్తుంది. కానీ ఇప్పుడు తాజా సమాచారం ఏదైనా అందిస్తుంది. ఏఐ ఫ్లాట్ ఫామ్స్ లో ప్రస్తుతం గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ వంటి ప్లాట్ ఫామ్స్ మాత్రమే రియల్ టైమ్ సమాచారాన్ని యూజర్లకు అందిస్తున్నాయి. తాజాగా చాట్ టీపీటీ కూడా ఆ జాబితాలో చేరింది.

మరోవైపు చాట్ జీపీటీలో ఇన్నాళ్లు కేవలం టెక్స్ట్, వాయిస్ రూపంలో ప్రశ్నలడిగేందుకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాయిస్, ఇమేజ్ క్యాపబిలిటీస్ ను తీసుకొచ్చింది. అంటే చాట్ జీపీటీతో నేరుగా యూజర్లు సంభాషణ జరపొచ్చు. ఈ సదుపాయాన్ని చాట్ జీపీటీ ప్లస్, ఎంటర్ ప్రైజెస్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

You may also like

Leave a Comment