Telugu News » భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ టాక్ మాత్రం అదిరింది.. ఫ్యాన్స్ కి పండగే..!

భగవంత్ కేసరి ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ టాక్ మాత్రం అదిరింది.. ఫ్యాన్స్ కి పండగే..!

by Sravya

బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకు వెళ్ళిపోతున్నారు. తాజాగా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హీట్స్ కొట్టేసిన బాలయ్య, ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టడానికి, రెడీగా ఉన్నారు, అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 20వ తారీకున రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. దసరాకి కానుకగా ఈ సినిమా రాబోతోంది.

Also read:

దసరా పండుగ తో పాటుగా బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య సినిమాతో కూడా పండగ చేసుకోబోతున్నారు. ఈ మూవీ తో బాలయ్య హిట్ కొట్టేలాగే కనబడుతున్నారు. బాలకృష్ణ లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమా యు/ఎ సర్టిఫికెట్ ని పొందింది మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రిపోర్ట్ లను ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య శ్రీలీలే మధ్య కామెడీ, ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయట.

ఈ సినిమా నుండి వచ్చిన గణపతి సాంగ్ హైలెట్ అయింది. కథ డిమాండ్ చేయకపోవడంతో కాజల్ తో పాటలు లేవు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయింది అని తెలుస్తోంది. బాలయ్య చెప్పిన డైలాగ్ లు కేక అంటున్నారు అంతా. బాలయ్య చెప్పే హిందీ డైలాగ్స్ ముఖ్యంగా అందరిని ఆకట్టుకుపోతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సీన్స్  గూస్ బంప్స్ ని తెప్పించడం గ్యారెంటీ అని అంటున్నారు. పైగా ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. భగవంత్ కేసరి సినిమాల మీద అంచనాలు అయితే బాగా పెరిగిపోయాయి. మరి బాలయ్య ఫ్యాన్స్ ని సినిమా ఎంతలా అలరిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

You may also like

Leave a Comment