దిల్ రాజు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రొడ్యూసర్ గా చాలా ఏళ్ళ నుండి సినిమాల్లో రాణిస్తున్నారు. తండ్రి శ్యామ్ సుందర్ గురించి కూడా అందరికీ తెలుసు. తండ్రి శ్యామ్ సుందర్ చనిపోయిన సంగతి కూడా మనకి తెలుసు. అయితే దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ వల్లే, దిల్ రాజు ఈ పొజిషన్ లో వున్నారని, వార్తలు వస్తున్నాయి. 86 సంవత్సరాల దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. శ్యామ్ సుందర్ కి మొత్తం ముగ్గురు పిల్లలు. ముగ్గురిలో చిన్నవాడు వెంకటరమణారెడ్డి.
వెంకటరమణారెడ్డిని ముద్దుగా చిన్నప్పటినుండి కూడా వీళ్లంతా రాజు అని పిలిచేవారు. రాజు పేరుతోనే ఇండస్ట్రీకి వచ్చారు. నిర్మాతగా మరి తెర మీదకి తీసుకువచ్చిన మొదటి సినిమాతో దిల్ రాజుగా మారిపోయారు. తండ్రి చనిపోవడంతో దిల్ రాజు శోకసంద్రంలో మునిగిపోయారు. దిల్ రాజు తండ్రి చనిపోవడంతో సెలబ్రిటీలు పరామర్శించారు. నేను లోకల్, శతమానంభవతి, ఫిదా వంటి సినిమాలతో దిల్ రాజు వందలాది కోట్ల రూపాయలని సంపాదించారు. కానీ దీనికి ముందు మాత్రం ఆయన కష్టాలని ఎదుర్కొన్నారట.
Also read:
కొంతమంది దిల్ రాజు కి ఆస్తి అంతా వారసత్వంగా వచ్చిందని చెప్తూ ఉంటారు వారసత్వంగా దిల్ రాజుకి వచ్చిన ఆస్తులు కావివి. ఆయనే కష్టపడి సంపాదించుకున్నారు మొదట రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన దిగారట కానీ కొంతకాలం తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చి ఇన్ని కోట్ల ఆస్తులని పొందారు. హైదరాబాదులోనే ఖరీదైన ఇళ్ళు కూడా ఉన్నాయట. అలానే కార్లు కూడా దిల్ రాజ్ కి ఉన్నాయట చాలా ప్రాంతాల్లో థియేటర్లు కూడా దిల్ రాజుకి ఉన్నాయట. అయితే బిజినెస్ విషయంలో కూడా ఆచితూచి దిల్ రాజు ఉండడంతో ఇంత ఎత్తుకే ఎదిగారు.