మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ (Sherika De Armas) చిన్నవయస్సులో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) బారినపడి మృతిచెందింది. 26ఏళ్ల షెరికా ఈ ప్రమాదకర వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో(Miss World Competition) పాల్గొన్న ఆమె ఉరుగ్వేకు (Uruguay) ప్రాతినిధ్యం వహించింది.
కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె కీయోథెరపీ, రేడియో థెరపీలు చేయించుకున్నప్పటీ ఫలితం దక్కలేదు. షెరికా మరణాన్ని ఆమె సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2015లో ఆమె మిస్ ఉరుగ్వే కిరీటాన్ని దక్కించుకుంది.
2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా షెరికా మాట్లాడుతూ.. ‘బ్యూటీ మోడల్ అయినా, అడ్వర్టైజింగ్ మోడల్ అయినా.. క్యాట్‌వాక్ మోడల్ అయినా తానెప్పుడూ మోడల్‌గా ఉండడానికే ఇష్టపడతానని చెప్పింది. ఫ్యాషన్‌కు సంబంధించిన ప్రతీదీ తనకు ఇష్టమనే’ అని తెలిపింది.
ఆమె స్నేహితులు తీవ్ర విచారంతో ‘నిన్నెప్పుడు మర్చిపోం.. నీ ఆప్యాయత నీతో మేము పంచుకున్న ఆనందాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి’ అంటూ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.