పవన్ కళ్యాణ్ కూడా టాప్ హీరోలలో ఒకరు. పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలోకి మెగా హీరోగా వచ్చి ఎంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి బద్రి సినిమాలో నటించారు ఆ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఈ దంపతులకు అఖిర, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ విషయం కూడా మనకి తెలిసిందే. పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య మనస్పర్ధలు రావడం వలన ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఒంటరిగా వుంది . పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకొక పెళ్లి చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ నుండి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ సినిమాలకి కూడా దూరమయ్యారు రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ వరుస ఇంటర్వ్యూలు కి హాజరయ్యారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలు ఆమె చెప్పకు వచ్చారు ముఖ్యంగా పిల్లల గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. అయితే అఖిర, ఆద్య పేర్లు గురించి ఆ పేర్ల అర్ధాలు గురించి చాలా మందికి తెలియదు. అబ్బాయి పేరు అకిరా నందన్. అమ్మాయి పేరు ఆధ్యా కాత్యాయని.
Also read:
అకిరా అనే పేరు తనకి నచ్చి పెట్టానని నందన్ అనే పేరు నాన్నకి నచ్చడంతో నందన్ అనే పెట్టుకోవడం వలన అకిరా నందన్ గా మారిపోయిందని రేణు దేశాయ్ చెప్పారు. ఆద్య కడుపులో ఉన్నప్పుడు తాను ఒక ఆధ్యాత్మిక బుక్ చదివారట. అందులో తనకు ఆద్య అనే పేరు నచ్చిందని. మహా శక్తి మహాకాళి మహాలక్ష్మి అని మూడు పేర్ల కలయిక అని అలా పెట్టారట. గాయత్రి అమ్మవారి పేరు అయినటువంటి కాత్యాయనీ పేరు కూడా తనకి బాగా నచ్చి, రెండు కలిపి పెట్టానని చెప్పారు. అకిరా ఆధ్యా ఇంగ్లీషులో ఐదు అక్షరాలు వస్తాయని ఈ సందర్భంగా తన పిల్లల పేర్లు వెనుక అర్ధాన్ని రేణు దేశాయ్ చెప్పారు.