Telugu News » Ayodhya Ramayya : అయోధ్య రామయ్యకు పాదుకలు.. హైదరాబాదీకి దక్కిన మహా భాగ్యం..!!

Ayodhya Ramayya : అయోధ్య రామయ్యకు పాదుకలు.. హైదరాబాదీకి దక్కిన మహా భాగ్యం..!!

అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస శాస్త్రి కోటి రూపాయలకు పైగా వెచ్చించి ఈ పాదుకలను సిద్ధం చేశారు. ఈ ప్యాడ్‌ల తయారీకి 8 కిలోల వెండితో పాటు, కిలో బంగారంతో పూత పూశారు..

by Venu
After Supreme Court verdict on Ayodhya land

అయోధ్య (Ayodhya)లో అత్యంత సుందరంగా నిర్మించిన రామయ్య (Ramayya) ఆలయం ప్రారంభోత్సవానికి గడియలు సమీపిస్తోన్నాయి. ఈ క్రమంలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు (Sri Ramajanmabhoomi Tirthakshetra Trust) ఆలయ ప్రారంభోత్సవానికి, సుముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ (Modi) ఈ నెల 22న అయోధ్య ఆలయాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు.

మరోవైపు ఆలయ ద్వారాలు కట్టే భాగ్యం హైదరాబాద్‌కు దక్కగా, తాజాగా స్వామివారి పాదాలను చేసే మహద్భాగ్యం ఓ హైదరాబాదీకి దక్కింది. సికింద్రాబాద్ బోయినిపల్లికి చెందిన పిట్లంపల్లి రామలింగాచారి అయోధ్యరామయ్య పాదాలను అందంగా చెక్కారు. 15 కిలోల పంచలోహాలతో ఈ పాదుకలను తయారు చేసినట్లు రామలింగా చారి తెలిపారు.

అయోధ్య రామయ్య పాదుకలను చేసే అవకాశం, హైదరాబాద్ (Hyderabad) కళాకారుడికి లభించడం.. యావత్ తెలుగు వారందరికీ గర్వకారణం అనుకొంటున్నారు భక్తులు.. కాగా అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస శాస్త్రి కోటి రూపాయలకు పైగా వెచ్చించి ఈ పాదుకలను సిద్ధం చేశారు. ఈ ప్యాడ్‌ల తయారీకి 8 కిలోల వెండితో పాటు, కిలో బంగారంతో పూత పూశారు.. నేడు విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్న ఈ పాదుకలను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేయనున్నట్లు సమాచారం.

మరోవైపు సికింద్రాబాద్‌లోని అనురాధ టింబర్‌ ఎస్టేట్‌కు అయోధ్య ఆలయంలో రాముడు కొలువై ఉన్న గర్భగుడితో పాటు ప్రాంగణంలోని అన్ని ద్వారాలను తయారు చేసే భాగ్యం దక్కింది.. ఇందుకోసం అయోధ్యలో ఒక ప్రత్యేక కర్మాగారం ఏర్పాటు చేయబడింది.. అక్కడ కార్మికులు ఆలయ ప్రధాన ద్వారం, మిగిలిన భాగాన్ని అందంగా చెక్కారు. ఇప్పటికే ద్వారాలు, తలుపుల తయారీ పూర్తికాగా వాటిని ఆలయంలో బిగించే ఏర్పాట్లలో ఉన్నారు..

You may also like

Leave a Comment