Telugu News » Ayodhya : అయోధ్య స్థల వివాదం ఎలా మొదలైంది..? అసలేం జరిగింది..?

Ayodhya : అయోధ్య స్థల వివాదం ఎలా మొదలైంది..? అసలేం జరిగింది..?

అయోధ్య స్థల వివాదంపై కోర్టు కేసులు నడిచాయి. సుప్రీంకోర్టులో ఏం జరిగింది..? చివరకు వివాదం ఎలా క్లోజ్ అయింది అనేది.. డేట్స్ తో సహా పూర్తి వివరాల్ని ‘రాష్ట్ర’ తర్వాతి కథనంలో చూద్దాం.

by admin
History of Ayodhya land dispute

దశాబ్దాల హిందూవుల కల నెరవేరుతోంది. అయోధ్య (Ayodhya) లో దివ్యభవ్య రామ మందిరం రూపుదిద్దుకుని.. బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ‘రాష్ట్ర’ (Raashtra) వరుస కథనాలు అందిస్తోంది. ఇంతకుముందు అయోధ్య చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రామ మందిర స్థల వివాదమేంటి..? గతంలో ఏం జరిగిందనేది చూస్తే…

History of Ayodhya land dispute

మొఘల్ రాజు చేసిన పనితో రేగిన చిచ్చు

భారతదేశం హిందూవుల రాజ్యం. ఎంతోమంది విదేశీయులు మన దేశంపై దండయాత్ర చేసి దోచుకున్నారు. అలా వచ్చిన వాళ్లలో మొఘలులు ఒకరు. 1528వ సంవత్సరంలో మొఘల్ రాజు బాబర్ అయోధ్యలోని రామాలయం ప్రదేశంలో మసీదు నిర్మించాడు. అయోధ్య అనేది రాముడు పుట్టిన స్థలం. అలాంటి పుణ్యప్రదేశంలో ఆలయాన్ని కూల్చేసి మసీదును కట్టడాన్ని హిందూవులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచే వివాదం మొదలైంది.

బ్రిటీష్ హయాంలో ముదిరిన వివాదం

అయోధ్య స్థలంలో మసీదు నిర్మాణం విషయంలో మొదట్నుంచి ఘర్షణలు చెలరేగాయి. అయితే.. 1853 నుంచి అధికం అయ్యాయి. హిందూ, ముస్లింల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలో దేశం బ్రిటీష్ పాలనలో ఉంది. ఈ చిచ్చును ఆర్పేందుకు 1859లో బ్రిటిష్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ స్థలాన్ని రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయటి స్థలం రామాలయం కోసం ఉద్దేశిస్తూ విభజించింది.

బయటపడ్డ విగ్రహాలు.. కోర్టు కేసులు

అయోధ్య స్థల వివాదం తొలిసారి 1885లో కోర్టు దృష్టికి వెళ్లింది. ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్.. ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అయోధ్య స్థలం కోసం హిందువులంతా ఒక్కటయ్యారు. దానికి కారణం.. 1949లో మసీదులో శ్రీరాముడు, సీతాదేవిల విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. తర్వాత సివిల్ సూట్‌ ను ఫైల్ చేశాయి. దీంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసి వివాద స్థలంగా ప్రకటించింది.

అయోధ్య కమిటీ.. అద్వానీ కీలక పాత్ర

1984లో విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో పలు హిందూ సంస్థలు, హిందూవులు ఓ కమిటీగా ఏర్పడ్డారు. రాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పడింది. తర్వాత ఇది బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ చేతుల్లోకి వెళ్లింది. గేట్లు ఓపెన్ చేయాలని హిందూవులను పూజలు చేయనివ్వాలని 1986లో జిల్లా జడ్జి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత పలువురు ముస్లింలు కూడా మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. 1989లో రాజీవ్ గాంధీ గేట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. దీంతో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ వంటి హిందూత్వ సంస్థలు, బీజేపీ.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించాయి. 1990లో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, విఫలమయ్యాయి. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారని ఆగ్రహంతో అద్వానీ రథయాత్ర చేశారు. 1992లో కరసేవకులు మసీదును కూల్చేశారు. దీంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. 2002లో వాజ్ పేయి ప్రభుత్వం హిందూ, ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ ప్రారంభించింది.

అయోధ్య స్థల వివాదంపై కోర్టు కేసులు నడిచాయి. సుప్రీంకోర్టులో ఏం జరిగింది..? చివరకు వివాదం ఎలా క్లోజ్ అయింది అనేది.. డేట్స్ తో సహా పూర్తి వివరాల్ని ‘రాష్ట్ర’ తర్వాతి కథనంలో చూద్దాం.

You may also like

Leave a Comment