Telugu News » LIC : ఎల్‌ఐసికి జీఎస్టీ నోటీసులు..!!

LIC : ఎల్‌ఐసికి జీఎస్టీ నోటీసులు..!!

దాదాపు రూ. 37 వేల కోట్ల జీఎస్టీ డిమాండ్ ఆర్డర్‌ను.. 2023 అక్టోబర్‌లో ఎల్‌ఐసీకి పంపారు. అందులో 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరంలో కొన్ని ఇన్‌వాయిస్‌లపై 18 శాతానికి బదులుగా 12 శాతం చొప్పున పన్ను చెల్లించిందని ఆరోపించారు.

by Venu

ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసి (LIC)కి న్యూ ఇయర్ ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఈ కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ (GST) నోటీసు అందింది. ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ GST నోటీసును అందుకొంది. ఇందులో రూ.365.02 కోట్ల జీఎస్టీ, రూ.404.7 కోట్ల పెనాల్టీ, రూ.36.5 కోట్ల వడ్డీ ఉన్నాయి.

ముంబై (Mumbai) స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ GST నోటీసులు అందాయి.. అయితే ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు ఈ కంపెనీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించిన నాన్-రివర్సల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ జిఎస్‌టి నోటీసు కంపెనీ ఆర్థిక, కార్యాచరణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఎల్‌ఐసి సంస్థ తెలిపింది.

దాదాపు రూ. 37 వేల కోట్ల జీఎస్టీ డిమాండ్ ఆర్డర్‌ను.. 2023 అక్టోబర్‌లో ఎల్‌ఐసీకి పంపారు. అందులో 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరంలో కొన్ని ఇన్‌వాయిస్‌లపై 18 శాతానికి బదులుగా 12 శాతం చొప్పున పన్ను చెల్లించిందని ఆరోపించారు. ఈ క్రమంలో శ్రీనగర్‌కు చెందిన రాష్ట్ర ఆదాయపు పన్ను అధికారి ఒకరు.. కంపెనీపై రూ.10462 కోట్ల జీఎస్టీ, రూ.20 వేల కోట్ల జరిమానా, రూ.6,382 కోట్ల వడ్డీ విధించారు.

మరోవైపు ఎల్‌ఐసీకి అక్టోబర్‌లో కూడా రూ.84 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.290 కోట్ల ఆదాయపు పన్ను పెనాల్టీ నోటీసులు పంపారు. అయితే దీనిపై తాము అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఎల్‌ఐసీ వివరించింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ శాఖ రూ. 12.61 కోట్ల జరిమానా, 2018-19 సంవత్సరంలో రూ. 33.82 కోట్లు.. అలాగే 2019-20 మదింపు సంవత్సరానికి గానూ ఏకంగా రూ. 37.58 కోట్ల జరిమానా విధించినట్లు LIC రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆ సమయంలో తెలిపింది.

You may also like

Leave a Comment