Telugu News » RGV : న్యూ ఇయర్ పార్టీలో ఆర్జీవీ రచ్చ.. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!

RGV : న్యూ ఇయర్ పార్టీలో ఆర్జీవీ రచ్చ.. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!

నెటిజన్స్, వర్మ తో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఎవరా అని ఆరా తీశారు.. ఆమె పేరు సిరి స్టేజి అని తెలిసింది.. నిజానికి ఈ అమ్మాయి కూడా గతంలో అర్జీవిని ఓ ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తుంది..

by Venu

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇండస్ట్రీ డైరెక్టర్స్లో కాస్త డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా పేరుతెచ్చుకొన్నాడు. ఈ ప్రపంచంలో ఒక మనిషి ఎలా ఉండాలో..అంతకు మించిన ఆలోచనతో బతికేస్తుంటాడు. కొన్ని సార్లు అతని మాటలు..అతని ఆలోచనలు ఎవ్వరికీ అర్ధం కాకుండా కూడా ఉంటాయి. అందుకే వర్మ స్టయిలే వేరంటారు..

సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వర్మ.. ఆయన చేసిన పోస్టులు ఏ రేంజ్ లో వివాదాలను తెస్తాయో అందరికి తెలుసు.. అయితే న్యూ ఇయర్ (New Year) సందర్భంగా వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.. న్యూయర్ పార్టీ ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేశాడు.. ఆ ఫోటోలో ఆర్జీవి తో ఓ అమ్మాయి కనిపించింది.. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయి వీడియో ఒకటి షేర్ చేసి, నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఈమె అని వర్మ ట్యాగ్ చేశాడు.

దీంతో నెటిజన్స్, వర్మ తో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఎవరా అని ఆరా తీశారు.. ఆమె పేరు సిరి స్టేజి అని తెలిసింది.. నిజానికి ఈ అమ్మాయి కూడా గతంలో అర్జీవిని ఓ ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తుంది.. అప్పుడే సిరి (Siri) బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి ఆర్జీవీతో పార్టీలో కలిసి రచ్చ చేసి నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు సిరి స్టేజి.. ఇప్పటికీ చాలా మందికి తెలియదని అంటున్నారు..

అయితే రాంగోపాల్ వర్మని హగ్ చేసుకుని 10 రోజుల వరకు స్నానం చెయ్యను అంటూ కామెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. ఇలాంటి బిస్కట్ వేసిన తర్వాత రాంగోపాల్ వర్మ ఊరికే ఉంటాడా.. వెంటనే ఈమెకు బ్రేక్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఈమెతో ఓ హాట్ ఇంటర్వ్యూ సైతం పూర్తి చేశాడు.. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఆర్జీవితో సందడి చేసిన సిరికి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment