Telugu News » AAP: హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ బాటిళ్లు పెట్టి శోభాయాత్ర..!!

AAP: హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ బాటిళ్లు పెట్టి శోభాయాత్ర..!!

హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) వ్యవహరించిన తీరు వివాస్పదంగా మారింది. హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం పట్ల నెటిజన్లు, హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

by Mano
AAP: Shobhayatra with insulin bottles in Hanuman's hand..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు సోమవారం తిహార్ జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న ఆయనకు షుగల్ లెవల్స్ 320కి పెరగడంతో ఆయనకు ఇన్సులిన్ ఇచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) వ్యవహరించిన తీరు వివాస్పదంగా మారింది.

AAP: Shobhayatra with insulin bottles in Hanuman's hand..!!

 

హనుమంతుడి వేషధారణలో ఉన్న వ్యక్తి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం పట్ల నెటిజన్లు, హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమ్ పార్టీ లీడర్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాల్గొన్న ఈ ర్యాలీలో హనుమంతుడి వేషధారణలో ఉన్న వ్యక్తి రెండు చేతుల్లో ఇన్సులిన్ బాటిళ్లు పట్టుకున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇస్తే హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడమేంటని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కేజ్రీవాల్ సోమవారం తీహార్ సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో తన గ్లూకోజ్ మీటర్ రీడింగ్ 250 నుంచి 320 మధ్య ప్రమాదకరమైన పరిధిని కలిగి ఉన్నందున ఇన్సులిన్ కోసం అభ్యర్థించారు. దీంతో జైలు అధికారులు వైద్యుల సూచన మేరకు ఆయనకు ఇన్సులిన్ డోస్ ఇప్పించారు. అయితే ఆప్ నేతలు మాత్రం బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఆ పార్టీ కేజ్రీవాల్‌ను చంపేయాలని కుట్ర చేస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

జైలు అధికారులు కావాలనే చికిత్స అందించడంలేదన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమేనని, ఆయనకు ఇన్సులిన్ అవసరమని జైలు అధికారులు ఇప్పుడు తేరుకున్నారని తెలిపారు. అయితే ఇన్ని రోజులు ఉద్దేశపూర్వకంగానే చికిత్స అందించలేదని ఎంపీ సంజయ్ సింగ్ దుయ్యబట్టారు. అదేవిధంగా ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమే లేదని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment