నటుడు మురళీ శర్మ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మురళీ శర్మ చాలా సినిమాల్లో నటించి మంచి పేరుని తెచ్చుకున్నారు భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, అల వైకుంఠపురం లో ఇలా చాలా సినిమాల్లో నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. మురళీ శర్మ తెలుగులో నటించడానికి ముందు హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బిజీ ఆర్టిస్ట్ కింద మారిపోయారు. మురళీ శర్మ ప్రేక్షకులకి బిగ్ స్క్రీన్ పై నటుడుగా ముఖ పరిచయం మాత్రమే.
కానీ ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఆయన కుటుంబం, భార్య పిల్లల గురించి చాలా మందికి తెలియదు. బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న మురళి శర్మ తెలుగు ఆయనే. కానీ ఎక్కువగా హిందీలో నటించారు. ఆయన భార్య పేరు అశ్విని కాల శేఖర్. ఈమె కూడా బిజీ ఆర్టిస్ట్. హిందీలో అనేక సీరియల్స్ లో సినిమాల్లో ఈమె నటించి అందరిని ఆకట్టుకున్నారు.
సిఐడి సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమయ్యారు ఆమె. బద్రీనాథ్ సినిమాలో ”నేనెవరో తెలుసా నీ మేనత్తని ఈ రాష్ట్రాన్ని పాలించే సర్కార్ భార్యని” అని చెప్పి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. బద్రీనాథ్లో ఈమె నటించారు అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు ఎవరైనా. రవితేజ నటించిన నిప్పు సినిమాలో కూడా ఈమె కనపడ్డారు. చివరిసారి మెహబూబా సినిమాలో ఈమె కనపడ్డారు. ప్రస్తుతం ఈమె వరస హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.
- మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! Latest Telugu News కోసం అయితే ఇక్కడ చదవండి !