లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలన్నీ కూడా అదిరిపోతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అందరూ కూడా అలెర్ట్ అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ అక్కడ ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరోలు అందరినీ ఒకే చోటకి చేర్చే పనిలో పడ్డాడు లోకేష్. అందుకే ఏకంగా యూనివర్స్ ని క్రియేట్ చేసాడు. ఈ సినిమాల్లో హీరోలతో పాటే నెపోలియన్ అనే ఒక క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also read:
నెపోలియన్ పాత్ర చేసిన అతను ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు అయిన పేరు జార్జ్ మరియన్. చెన్నైలో పుట్టి పెరిగారు. 1989 లో థియేటర్ ఆర్టిస్టుగా కెరియర్ని స్టార్ట్ చేశారు 13 ఏళ్ల పాటు అందులోనే కొనసాగించారు. 2002లో ఒక తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు కామెడీ తరహా పాత్రలతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. 70 దాకా సినిమాల్లో నటించారు ఖైదీ సినిమాలో నెపోలియన్ అనే కానిస్టేబుల్ గా నటించి జార్జ్ మరియన్ బాగా పాపులర్ అయిపోయారు.
అలానే ఈ మధ్య వచ్చిన లియో సినిమాలో కూడా గెస్ట్ అపీరియన్స్ లో కనిపించారు. లియో సినిమాలో నెపోలియన్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక రేంజ్ లో ఆడియన్స్ గోల వినబడింది ఈ సినిమా చివరన ఫ్యామిలీని కాపాడే టైంలో ఆయన ఇచ్చిన ఎలివేషన్ లో ఉంది. ఈ వయసులో ఇలా నటించడం చాలా గ్రేట్ కదా..?