Telugu News » రజీనీకాంత్ తో సహా.. ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న.. 9 మంది నటులు వీళ్ళే…!

రజీనీకాంత్ తో సహా.. ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న.. 9 మంది నటులు వీళ్ళే…!

by Sravya

చాలామంది పెద్దపెద్ద స్టార్లు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది స్టార్స్ అవ్వాలని ప్రభుత్వ ఉద్యోగాలని కూడా వదిలేసుకున్నారు. అలా ప్రభుత్వ ఉద్యోగాలని వదిలేసుకున్న హీరోల వివరాలు చూద్దాం.

రాజ్ కుమార్:

40వ దశకం చివర్లో రాజకుమారి ముంబైకి వెళ్లి అక్కడ ముంబై పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు. బాలీవుడ్లో కెరీర్ ని స్టార్ట్ చేయాలని జాబ్ ని వదిలేసారు.

రజనీకాంత్:

Rajinikanth counter to ycp

హీరో రజనీకాంత్ కూడా ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా పని చేసేవారు. తర్వాత హీరో అయ్యాక ఆ జాబ్ ని వదులుకున్నారు.

Also read:

దిలీప్ కుమార్:

 

దివంగత నటుడు దిలీప్ కుమార్ పూణేలో మిలటరీ క్యాంటీన్ ని నడిపేవారు తర్వాత బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.

శివాజీ సతమ్:

ఏసీబీ ప్రద్యుమన్ పాత్రలో నటించే శివాజీ సతమ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ గా పనిచేసేవారు. నటన మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు.

అమోల్ పాలేకర్:

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగాన్ని వదిలేసుకుని బాలీవుడ్లోకి వెళ్లిపోయారు.

దేవ్ ఆనంద్:

బాలీవుడ్ లోకి రాకముందు దేవ్ ఆనంద్ సెన్సార్ బోర్డ్ క్లర్క్ గా పని చేశారు.

జానీ వాకర్:

సినిమాల్లోకి రాకముందు జానీ వాకర్ ముంబైలో బస్ కండక్టర్ గా పని చేసేవారు. తర్వాత సినిమాల్లోకి రావడంతో ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు.

అమ్రిష్ పూరి:

స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు కానీ నటన మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు.

బాల్‌రాజ్ సాహ్ని:

బెంగాల్లోని శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేశారు కానీ నటన మీద ఆసక్తితో జాబ్ ని వదులుకున్నారు.

You may also like

Leave a Comment