Telugu News » మంగళవారం సినిమాలోని జమీందారు భార్యగా నటించిన ఆమె ఎవరో తెలుసా..?

మంగళవారం సినిమాలోని జమీందారు భార్యగా నటించిన ఆమె ఎవరో తెలుసా..?

by Sravya

పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన మంగళవారం సినిమాకి రెస్పాన్స్ బాగుంది ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన రోల్ కి మంచి పేరు వస్తోంది. పాయల్ ఈ సినిమా తో తన రేంజ్ ని కూడా పెంచేసుకుంది ఈ సినిమాలో జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయి కూడా చాలా బాగుంది. నిజానికి ఆమె తన అందంతో పాయల్ కి పోటీస్తోంది. పాయల్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సినిమా సొంతం చేసుకుంది. థియేటర్లలో మంగళవారం సినిమాను చూడడానికి జనాలు పోటెత్తుతున్నారు. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఇక పాయల్ కాకుండా నటించిన ఇంకొక హీరోయిన్ వివరాల్లోకి వెళితే జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయి అందంగా వుంది. సోషల్ మీడియాలో అంతా కూడా ఆమె గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టారు.

Also read:

జమీందారు భార్య పాత్రలో మెరిసిన ఆమె పేరు దివ్య పిళ్ళై తెలుగులోనే కాకుండా ఈమె మలయాళం లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. దివ్య టాలెంట్ ని గుర్తించిన అజయ్ భూపతి మంగళవారం సినిమాలో ఒక రోల్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మంగళవారం సినిమాలో నటించినందుకు ఈమెకి కూడా బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అవకాశాలు కూడా ఇప్పుడు ఆమెకి బాగా వస్తాయని టాక్. ఇప్పటికే ఆమెని పలువురు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.

You may also like

Leave a Comment