శృతిహాసన్(Shruti Haasan)రెండు తరాలకు వారధిగా మారిన తార. ఒకప్పుడు తన అందచందాలతో కుర్ర హీరోలను కుదిపేసింది. ప్రస్తతం సీనియర్ హీరోలకు హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తోంది.
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya), వీర సింహారెడ్డి(Veera Simha Reddy)సినిమాలతో ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది శ్రుతి హాసన్.ఈ రెండు సినిమాల తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ. ఇక త్వరలోనే ప్రభాస్ సరసన సలార్(Salar)సినిమాతో అలరించనుంది.
ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రుతి. తన లేటేస్ట్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. తన ప్రియుడు శాంతను గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది శ్రుతిహాసన్.
తాజాగా ఇన్ స్టాలో శ్రుతి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఎవరికో కౌంటరిస్తున్నట్లుగా కూడా ఉంది. దీంతో శ్రుతి షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ శ్రుతి ఏం పోస్ట్ చేసిందో తెలుసుకుందామా…”నేను కొందరినీ గమనిస్తుంటాను. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసి మౌనంగా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగినట్లు శిక్షిస్తుంది” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది శ్రుతి హాసన్.
అయితే శ్రుతి షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే.. ఆమె ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ బ్యూటీని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇంతకీ శ్రుతి ఇలా ఆకస్మాత్తుగా కర్మ సిద్ధాంతం గురించి పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.