Telugu News » ఎట్టకేలకు సోనీలీవ్‌ లోకి వచ్చిన ఏజెంట్‌!

ఎట్టకేలకు సోనీలీవ్‌ లోకి వచ్చిన ఏజెంట్‌!

ఈ సినిమాను రీ-ఎడిట్‌ చేస్తున్నారని, కొత్త సీన్స్‌ను యాడ్ చేస్తున్నారని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ వాస్తవాలని అందులో ఎలాంటి నిజం లేదని

by Sai
agent-movie-streaming-date-cinfirmed

సూపర్‌ హిట్టయిన సినిమాలే రెండు, మూడు వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తుంటే.. అల్ట్రా డిజాస్టర్ అయిన ఏజెంట్‌ సినిమాకు మాత్రం ఓటీటీ మోక్షం లేదు. ఆ మధ్య సోనిలివ్‌ సంస్థ అధికారికంగా ఓ డేట్‌ను ప్రకటించింది. తీరా చూస్తే ఆ రోజున రాలేదు. ఏదైనా టెక్నికల్‌ ఇష్యూ అయ్యింటుంది.. రెండు, మూడు రోజుల్లో వస్తుందనుకుంటే ఇప్పటికే ఐదు నెలలు దాటేసింది. ఇంకా ఓటీటీలోకి రాలేదు. దాంతో మళ్లీ ఈ సినిమాను రీ-ఎడిట్‌ చేస్తున్నారని, కొత్త సీన్స్‌ను యాడ్ చేస్తున్నారని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ వాస్తవాలని అందులో ఎలాంటి నిజం లేదని ఆ మధ్య నిర్మాత అనీల్‌ సుంకర క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అక్కినేని ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ను సోనిలివ్‌ సంస్థ తీసుకొచ్చింది.

agent-movie-streaming-date-cinfirmed

తాజాగా సోని లివ్‌ సంస్థ ఏజెంట్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను కన్ఫర్మ్‌ చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 29నుంచి స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ వార్తతో అక్కినేని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పలువురు నెటిజన్లు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీలవ్వలేను అని ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మాములు డిజాస్టర్‌ కాలేదు. అటు నిర్మాతను, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లను నిండా ముంచింది. పాతిక కోట్ల మార్కెట్‌ కూడా లేని అఖిల్‌తో ఎనభై కోట్ల బడ్జెట్‌తో సినిమా తీశారంటే కంటెంట్‌ ఏ రేంజ్‌లో ఉండి ఉండాలే.

ప్రస్తుతం కంటెంట్‌ యుగం నడుస్తుంది. కంటెంట్‌తో వస్తే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో కళ్లు చేదిరే కలెక్షన్‌లు తెచ్చిపెడుతున్నాయి. అలాంటిది బౌండెడ్‌ స్క్రిప్ట్‌ లేకుండా ముందుగా యాబై కోట్లు లెక్కలేసి.. ఆపై మళ్లీ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసారు. తీరా బడ్జెట్‌లో సగం రేటుకే సినిమాను అమ్మేశారు. పోని అదైన వచ్చిందా అంటే అదీ లేదు. బడ్జెట్‌లో పదిశాతం కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా ఫేయిల్యూర్‌ను అనీల్ సుంకర నిర్మొహమాటంగానే ఒప్పేసుకున్నాడు. ఈ సినిమాను తక్కువ రేటుకే కొన్నప్పటికి బయ్యర్లు తీవ్ర నష్టాల్ని చూశారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య నటించింది. తమిళ సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.

You may also like

Leave a Comment