మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు స్వయంకృషితో సినిమాల్లోకి ఎదిగి, ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలని పరిచయం చేశారు చిరు. చిరంజీవి కెరియర్ ప్రారంభించిన రోజుల్లో అతనిలోని యాక్టింగ్ స్కిల్స్ ని చూసి ఇతను ఎప్పటికైనా పెద్ద స్టార్ హీరోగా ఎదుగుతాడని అల్లు రామలింగయ్య గ్రహించారు. చిరంజీవికి తన కూతురు సురేఖని ఇచ్చి పెళ్లి చేశారు ఒకపక్క ఫేమస్ కమెడియన్ కి అల్లుడు. ఇంకోపక్క ఫేమస్ నిర్మాతకి బావ. సుప్రీం హీరో మెగాస్టార్ కి ఇలా అంతా జరిగిపోయింది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరు హీరోగా అప్పుడే ఎదుగుతున్నారు. అప్పటికే బాలకృష్ణ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. చిరు తప్ప మిగిలిన వాళ్ళందరూ అప్పట్లో ఎక్కువ కమ్మ వాళ్ళు ఉన్నారు. అప్పటికే చిరంజీవికి మెల్లమెల్లగా క్రేజ్ పెరుగుతుంది. పెద్దవాళ్లతో జాగ్రత్తగా లేకపోతే ఎదగడం కష్టం తెలిసో తెలియకో చిరంజీవి ఏమైనా పొరపాటు చేస్తే అధికారంలో ఉన్న ఎన్టీఆర్ తొక్కేయవచ్చు.
Also read:
పైగా తమ కులం వాళ్ళు అప్పటికే అంత ఫేమ్ కాలేదు కనుక చిరుని జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కించారు అల్లు రామలింగయ్య. చిరు చాలా కాలం పాటు ఎన్టీఆర్ కి గుడ్ మార్నింగ్ చెప్పేవారట. చిరు ని పిలిచి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకల్లా ఎన్టీఆర్ గారి ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఉండమని చెప్పారు. అప్పుడు 9999 వైట్ అంబాసిడర్ లో ఎన్టీఆర్ బయటకి వస్తారు. వెంటనే నమస్కారం చేయి అని చెప్పారట ఈ కుర్రాడు పైకి వస్తాడని ఆలోచన ఎన్టీఆర్ కి కలుగుతుందని అల్లు రామలింగయ్య ఆలోచన