Telugu News » Ambati Rambabu:  వాళ్లంతా పొలిటికల్ డ్యాన్సర్లు.. అంబటి సంచలన వ్యాఖ్యలు..!

Ambati Rambabu:  వాళ్లంతా పొలిటికల్ డ్యాన్సర్లు.. అంబటి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ, జనసేన అధినేతలపై మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

by Mano
Ambati Rambabu: They are all political dancers.. Ambati's sensational comments..!

ఏపీ మంత్రి(AP Minister) అంబటి రాంబాబు(Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి(Sathepally)లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన అధినేతలపై మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

Ambati Rambabu: They are all political dancers.. Ambati's sensational comments..!

 

తాను చంద్రబాబును ఎప్పుడూ తిట్టలేదని.. కేవలం రాజకీయంగా మాత్రమే విమర్శించానని వెల్లడించారు. చంద్రబాబును తిట్టిన వాళ్లంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారని తెలిపారు. తాను పండక్కి డ్యాన్స్ చేస్తే విమర్శిస్తున్నారు కానీ.. చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్యాన్స్‌ర్లని సెటైర్ వేశారు.

పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే.. చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు కాసేపు పవన్‌తో, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తారంటూ చమత్కరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని అంబటి జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు జనమే రాలేదన్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ధ్వజమెత్తారు.

You may also like

Leave a Comment