Telugu News » Ambati Rayudu: రోహిత్‌శర్మ ఆ జట్టుకు మారితే బెటర్‌: అంబటిరాయుడు

Ambati Rayudu: రోహిత్‌శర్మ ఆ జట్టుకు మారితే బెటర్‌: అంబటిరాయుడు

కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌శర్మ(Rohith Sharma) చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టుకు మారితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

by Mano
Ambati Rayudu: Better if Rohit Sharma moves to that team: Ambati Rayudu

మరో 11 రోజుల్లో ఐపీఎల్(IPL-2024) 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌శర్మ(Rohith Sharma) చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టుకు మారితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

Ambati Rayudu: Better if Rohit Sharma moves to that team: Ambati Rayudu

‘రోహిత్ చాలాకాలం నుంచి ముంబై జట్టుకు ఆడుతున్నాడు. ఇంకో 5-6 ఏళ్లపాటు క్రికెట్ ఆడగలడు. ఒకవేళ ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అయితే, 2025 నుంచి రోహిత్ చెన్నై జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా. అతడు చెన్నైకి ఆడితే బాగుంటుంది. అక్కడ అతడికి ఈజీగానే కెప్టెన్సీ లభిస్తుంది’ అని రాయుడు ఓ సందర్భంలో అన్నాడు.

2025లో ఐపీఎల్ మెగా వేలం ఉండనుంది. అందులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ను వదిలేసి హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే ఏడాది ధోనీ రిటైరైతే, రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారాలని అంబటి రాయుడు సూచించాడు.

మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో ఐపీఎల్ సీజన్- 17 ప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా వారివారి ఫ్రాంజైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు. ఇక ధర్మశాల టెస్టులో రోహిత్ వెన్నునొప్పితో బాధపడటంతో అతడి స్థానంలో పేసర్ జస్ప్రత్ బుమ్రా జట్టును నడిపించాడు.

ఇక టీమ్ఇండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్లు ఏమీ లేవు. జూన్‌లో నేరుగా టీ20 వరల్డ్కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి వెస్టిండీస్, యూఎస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే పొట్టికప్ టోర్నీ దృష్యా రోహిత్ 2024 ఐపీఎల్కు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment