Telugu News » Balka Suman: యావత్ దళిత జాతికి అవమానం: బాల్క సుమన్

Balka Suman: యావత్ దళిత జాతికి అవమానం: బాల్క సుమన్

విక్రమార్క(Bhatti Vikramarka)కు అవమానం జరిగిందని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) స్పందించారు.

by Mano
Balka Suman: Shame on the entire Dalit race: Balka Suman

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు అవమానం జరిగిందని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(సోమవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.

Balka Suman: Shame on the entire Dalit race: Balka Suman

కాంగ్రెస్ పార్టీ ఈరోజు యావత్ దళిత జాతిని అవమానించిందన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణినీ పైన కూర్చోబెట్టి బీసీబిడ్డ అయిన మంత్రి కొండా సురేఖను కింద కూర్చోబెట్టారని ఆరోపించారు.

సాక్ష్యాత్తూ దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే.. దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి.. ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన బట్టి విక్రమార్కనే అవమానించారన్నారు. 74ఏళ్ల భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతూనే ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన ఫొటోను పక్కన పెట్టారని అన్నారు.

విసూనురి రామచంద్ర రెడ్డీ లాంటి వాడు రేవంత్ రెడ్డి అని, నయా దేశ్‌ముఖ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విక్రమార్కకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హై కామండ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ యాదాద్రిలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని హితవు పలికారు.

You may also like

Leave a Comment