గత ఏడాది భారత్లోని మణిపూర్ (Manipur)లో చేలరేగిన హింస అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తాజాగా ఈ విషయంపై అమెరికా (America) చేసిన పని ఆగ్రహానికి గురి చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు చాలా జరిగాయని అగ్రరాజ్యం విడుదల చేసిన ఒక నివేదికపై తాజాగా భారత్ తీవ్రంగా స్పందించింది. నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో పాల్గొన్న అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) మండిపడ్డారు..

ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ అందులో పలు అంశాలను పొందు పరిచింది. వాటిలో మనుషుల అదృశ్యాలు, చట్టవిరుద్ధమైన హత్యలు, ఏకపక్షంగా అరెస్టులు, బలవంతంగా నేరాన్ని ఒప్పుకోవడం కోసం హింసించడం, టెలికమ్యూనికేషన్లను నిరోధించడం, ఇంటర్నెట్ బంద్ చేయడం, పౌర సమాజ కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా వంటి వాటికి పాల్పడిందని పేర్కొంది.
ఇదేకాకుండా మానవ హక్కుల పరిరక్షకుల బెదిరింపు, నేరాలకు కుటుంబ సభ్యులను శిక్షించడం, హింస లేదా బెదిరింపులతో కూడిన నేరాలు వంటి జరిగాయని నివేదికలో పొందుపరిచింది. దీంతో అవగాహన లేకుండా రిపోర్ట్ తయారు చేసిందని భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.