Telugu News » Nizamabad : రేవంత్ రెడ్డికి అంత స్థాయి లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అర్వింద్..!

Nizamabad : రేవంత్ రెడ్డికి అంత స్థాయి లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అర్వింద్..!

మరోవైపు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేసిన ధర్మపురి అర్వింద్.. కేంద్రం ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసేసి వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు..

by Venu

రాష్ట్రంలో ఎన్నికల వేళ ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే బీఆర్ఎస్ ఎలాగో ఓడిపోతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ (BJP), కాంగ్రెస్ పోటీ మా రెండు పార్టీల మధ్య అని ప్రకటిస్తుంది. ఈ క్రమంలో విమర్శలు కూడా తీవ్రంగా గుప్పిస్తున్నారు.. తాజాగా కాంగ్రెస్ చార్జిషీట్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు.

dharmapuri arvind sensational comments on congress partyఓటుకు నోటు కేసు భయం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)లో మొదలైందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) ప్రచారంలో భాగంగా గురువారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ స్పీచ్‌ ల్లో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తప్పుడు మార్గంలో అధికారాన్ని సొంత చేసుకోవడానికి అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు..

మరోవైపు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేసిన ధర్మపురి అర్వింద్.. కేంద్రం ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసేసి వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశాన్ని తాలిబన్‌ అడ్డాగా మార్చేందుకు కాంగ్రెస్ (Congress) కుట్ర చేస్తోందని ఆరోపించిన ఆయన.. బీజేపీపై చార్జిషీట్ వేసే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు..

బీజేపీ పై ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో ప్రభుత్వం రాకుండా అడ్డుకోలేరన్నారు.. 400 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు.. ప్రధానిగా మోడీ (Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణలోనూ 12 నుంచి 14 స్థానాల్లో సత్తా చాటుతామని తెలిపిన అర్వింద్.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలు కనిపించకుండా కలిసే పనిచేస్తున్నాయని ఆరోపణలు చేశారు..

You may also like

Leave a Comment