Telugu News » America : అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిక్కీ హేలీకి ఊరట..!

America : అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిక్కీ హేలీకి ఊరట..!

ట్రంప్ 47 మందిని కైవసం చేసుకొగా.. హేలీ కేవలం ముగ్గురు డెలిగేట్‌లను మాత్రమే పొందినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

by Venu
USA: Trump is rushing into the presidential race.. Big shock for Nikki Haley..!

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి రేసు ఉత్కంఠంగా సాగుతుంది. భారత సంతతి మహిళ నిక్కీ హేలీ (Nikki Haley)కి.. అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు మధ్య పోరు పోటాపోటీగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికలలో హేలీకి కాస్త ఊరట లభించింది. వాషింగ్టన్‌ (Washington)లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో హేలీకి 62.9శాతం ఓట్లు రాగా, మాజీ అధ్యక్షుడు ట్రంపు 33.2శాతం ఓట్లు నమోదు చేసుకొన్నట్లు సమాచారం. హేలీ 19 మంది ప్రతినిధులను కైవసం చేసుకొంది. నామినేషన్ ప్రక్రియలో ఇది నిక్కీకి మొదటి గెలుపు. దీంతో వాషింగ్టన్‌లో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హేలీ నిలిచింది. అయితే హేలీ తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో 40 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నారు.

ఇక్కడ ట్రంప్ 47 మందిని కైవసం చేసుకొగా.. హేలీ కేవలం ముగ్గురు డెలిగేట్‌లను మాత్రమే పొందినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థిత్వానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా సహా 8 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం గెలుపొందారు.

తదుపరిగా మంగళవారం ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వాషింగ్టన్‌లో రిపబ్లికన్లు ట్రంపును తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు.. 2016లోనే ఇక్కడ జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఓట

You may also like

Leave a Comment